Bigg Boss 8 : కంటతడి పెట్టుకున్న మణికంఠ.. గెట్ అవుట్ అంటూ గేట్లు ఓపెన్ చేసిన బిగ్‌బాస్
తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది.

Bigg Boss 8 Drastic Exit Option Shocks Contestants
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగ సీజన్ 8లో మూడో వారం కొనసాగుతోంది. ఈ వారం గొడవలు, కొట్టుకోవడం, జట్టు పీక్కోవడం ఒకటే కాదు ఎన్నోన్నో జరిగాయి. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. నిఖిల్ క్లాన్‌లో ఉన్న పృథ్వీ ఆవేశంలో ఆడటం అనేది ఇంకో క్లాన్ అయిన అభయ్ క్లాన్‌కు నచ్చలేదు. పృథ్వీ ఆటతీరుపై వారు కామెంట్లు చేస్తూ కనిపించారు. పృథ్వీ నువ్వు ఆవేశ పడుతున్నావు. కంట్రోల్లో ఉండు అని కంట్రోల్ చేయడం మానేసి పోరా పోయి ఆడు అని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్? అని యష్మీ అంది.
ఇక మణికంఠను పృథ్వీ ఆల్‌మోస్ట్ కొట్టడానికి వచ్చాడు. గేమ్ ఎలా ఆడాలన్న విషయాన్ని మణికంఠకు నిఖిల్ వివరించే ప్రయత్నం చేశాడు. అయితే.. ఒక ఫ్రెండ్‌గా చెప్పాలనుకుంటున్నా. వినాలి అనుకుంటే విను లేకపోతే లేదు. నీలో ఆ యాంగిల్‌ను నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇక ఆ తరువాత బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరినీ నిలబెట్టి.. ఈ సీజన్‌లో క్లాన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి అని బిగ్‌బాస్ చెప్పాడు.
Jani Master : రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్‌ను విచారిస్తున్న పోలీసులు!
ఇక్కడ బిగ్‌బాస్ రూల్స్ మాత్రమే ఉంటాయన్నాడు. ఎవరికైనా తాము బిగ్‌బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే తక్షణమే ఇంటి నుంచి వెళ్లిపోవచ్చు అని చెప్పాడు. అదే సమయంలో గేట్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రొమో పూర్తి అయింది.