Arjun Kalyan Interview: ఆయన చివరి చూపు కూడా దక్కలేదు.. బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ ఎమోషనల్..
Bigg Boss Fame Arjun Kalyan Interview: ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇటీవల తన లైఫ్ లో జరిగిన ఓ విషాద ఘటనని పంచుకున్నాడు అర్జున్ కళ్యాణ్. (Arjun Kalyan)
Bigg Boss Fame Arjun Kalyan Emotional While Remembering Grand Father
Arjun Kalyan : సినిమాల మీద ఇంట్రెస్ట్ తో యుఎస్ లో జాబ్ మానేసి మరీ వచ్చాడు అర్జున్ కళ్యాణ్. మొదట పలు సినిమాల్లో నటించినా ఆ తర్వాత సీరియల్స్ తోనే ఫేమ్ తెచ్చుకున్నాడు అర్జున్ కళ్యాణ్. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం పలు టీవీ షోలు, సిరీస్ లతో బిజీగా ఉన్నాడు అర్జున్ కళ్యాణ్.
తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇటీవల తన లైఫ్ లో జరిగిన ఓ విషాద ఘటనని పంచుకున్నాడు అర్జున్ కళ్యాణ్.
Also Read : సర్జరీ ఆపేసి మరీ సినిమా షూటింగ్.. అది కూడా ప్రొస్తటిక్ మేకప్‌తో.. 62 ఏళ్ళ వయసులో నటి కష్టం..
అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ.. బీబీ జోడిలో సెమి ఫైనల్ షూట్ జరుగుతున్న రోజు మా తాతయ్య గారు చనిపోయారు. అప్పటికే నాకు టైఫాయిడ్ వచ్చింది. అయినా ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ఊరికి వెళ్లాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నా. కనీసం ముందు నా పార్ట్ షూటింగ్ చేయమని అడిగా. కానీ కుదరలేదు, షూట్ లేట్ అయింది.
నేను వెళ్ళేసరికే బాడీ తీసుకెళ్లిపోయారు. మా తాతయ్యని ఆఖరి చూపు చూసుకోలేకపోయాను. ఆ విషయంలో బాగా రీగ్రేట్ అయ్యా. మా తాతయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. లాస్ట్ ఉగాదికి స్టార్ మా ఉగాది ఈవెంట్ కి మా తాతయ్య, బామ్మని తీసుకొచ్చా. ఆయన దానికి చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికి తన మనవడు టీవీ లోకి తీసుకెళ్లాడు అని చెప్పుకున్నాడు. మా బామ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఆయన చివరి రోజుల్లో చాలా సఫర్ అయ్యారు హాస్పిటల్ లో. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ICU లోనే చనిపోయారు అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : ఆ ప్రేమ చచ్చిపోయింది.. సిన్సియర్ లవ్ పనికిరాదు.. తన లవ్ బ్రేకప్ పై బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ కామెంట్స్..
