Nuthan Nayudu : పండగ పూట విషాదం.. బిగ్ బాస్ కంటెస్టెంట్ తండ్రి కన్నుమూత..
బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు తండ్రి ఉత్తరాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేత సన్యాసి రావు నాయుడు నేడు ఉదయం మరణించారు.

Bigg Boss Fame Nuthan Nayudu father Congress Leader Sanyasi Rao Nayudu Passes Away on Dasara
Nuthan Nayudu : పండగ పూట విషాదం నెలకొంది. బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు తండ్రి ఉత్తరాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేత సన్యాసి రావు నాయుడు నేడు ఉదయం మరణించారు. బిగ్ బాస్ రెండో సీజన్లో పాల్గొని నూతన నాయుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యాడు. నూతన నాయుడు తండ్రి సీనియర్ కాంగ్రెస్ నేత.
Also Read : Game changer : గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ తో కొత్త పోస్టర్..
గత కొంతకాలంగా సన్యాసి రావు నాయుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందుకుంటూనే ఆయన నేడు ఉదయం మరణించారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు, నూతన నాయుడు సన్నిహితులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.