Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. మాడిపోయిన అగ్నిపరీక్ష బ్యాచ్ ఫేసులు.. బిగ్ బాస్ 10 డే 33 ఎపిసోడ్..
ఫైనల్ గా రోహిత్, ముకేశ్, షాలిని, చరణ్, అపూర్వ, నరేష్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. (Bigg Boss New Captain)
Bigg Boss New Captain
Bigg Boss New Captain : గ్రూపులుగా టాస్కులు పెట్టి నామినేషన్స్ నుంచి సేవ్ చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కెప్టెన్సీ అర్హతకు కూడా ఆ టాస్కులను ఆడిస్తున్నాడు బిగ్ బాస్. నేడు ముకేశ్ – ఝాన్సీ, షాలిని – రోహిత్ లాస్ట్ లో ఉన్నారని ఆ రెండు పెయిర్స్ లో ఎవరో ఒకరే ఆడాలి, ఇంకొకరు డేంజర్ జోన్ లో ఉండాలి అని బిగ్ బాస్ చెప్పాడు. వల్లనే అది డిసైడ్ చేసుకోమన్నాడు. దీంతో ఝాన్సీ నేను డేంజర్ జోన్ లో ఉంటాను, నువ్వు సేవ్ అవ్వు అని ముకేశ్ కి చెపింది. నా స్ట్రాటజీ నాకు ఉన్నాయి అని చెప్పింది. షాలిని ఊహించినట్టే తనే డేంజర్ లోకి వెళ్లి తానేంటో చూపిస్తాను అని చెప్పింది. రోహిత్ నెక్స్ట్ ఆడటానికి రెడీ అయ్యాడు.
ఝాన్సీ బిగ్ బాస్ తో తన మ్యాజిక్ పవర్ గుర్తు చేసి అందుకే నేను డేంజర్ జోన్ కి వెళ్లి ముకేశ్ అన్నని, నన్ను కాపాడుకుంటాను అని చెప్పింది. ముందు రోహిత్ సేఫ్ అవుదాం అనుకున్నా బిగ్ బాస్ అడిగినప్పుడు మాత్రం రోహిత్ డేంజర్ జోన్ లో ఉంటాను, షాలిని ఆడుతుంది అని చెప్పాడు. దీంతో ముకేశ్, షాలిని కలిసి ఒక గ్రూప్ గా ఆడతారు అని చెప్పాడు బిగ్ బాస్.
ఫ్లిప్ చెయ్, ఫేస్ చెయ్ అనే ఓ టాస్క్ పెట్టారు. కింద ఉన్న టైల్స్ ఓపెన్ చేస్తే దాంట్లో డేర్స్ ఉంటాయి, డేంజరస్ ఉంటాయి. వాటి బట్టి పెర్ఫార్మ్ చేసి ఒక్కొక్కరు ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవుతారు. దీనికి సంచాలక్ లు కూడా పాయింట్స్ ఇస్తారు. దేబ్జానీ, ఝాన్సీ సంచాలక్ గా వ్యవహరించారు ఈ టాస్క్ కి. ముకేశ్ కి స్లో మోషన్ లో ఫైట్ చేయాలి అని వచ్చింది. వంశీ తో సరదాగా చేసాడు. అపూర్వ హౌస్ లో కంటెస్టెంట్స్ ఓట్లతో ఎలిమినేట్ అవ్వాలి అని రావడంతో అందరూ ఆమె పక్కకి వెళ్లిపోవాలని ఓట్ వేశారు. దీంతో ఆ టాస్క్ నుంచి అపూర్వ వచ్చేసింది. నెక్స్ట్ నరేష్ కి డైస్ గేమ్ వస్తే అందులో రూల్స్ ప్రకారం షాలిని ఎలిమినేట్ అయింది. తర్వాత ముకేశ్ దోమలాగా చేయాలనీ రావడంతో ముకేశ్, నరేష్ సరదాగా చేసారు. తర్వాత ముకేశ్ ఆ టాస్క్ నుంచి తప్పుకున్నాడు. చరణ్ కి ఇష్టం లేని వాళ్ళని పొగడమని చెప్పడంతో వంశీ ని ట్రోల్ చేసాడు. అలా వాళ్లకు వచ్చినవి చేసుకుంటూ వెళ్లారు. ఈ టాస్క్ లో రామ్ ప్రసాద్ – నరేష్ గెలిచారు.
Also Read : Jailer 2 : డబ్బింగ్ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంపు.. జైలర్ 2 సినిమాకు ఎంత పెంచారంటే..
అనంతరం రోహిత్ అపూర్వ ని తనబ్యాచ్ లో కలుపుకుందామని మాట్లాడటానికి ట్రై చేద్దామంటే షాలిని గొడవ పెట్టుకుంది అపూర్వతో. రామ్ ప్రసాద్ , నరేష్ టాప్ లో ఉన్నా ఒకరు గేమ్ ఆడాలి. ఇంకొకరు డేంజర్ జోన్ లో ఉండి నామినేషన్స్ కి వెళ్ళాలి అని బిగ్ బాస్ చెప్పడంతో రామ్ ప్రసాద్ సేవ్ అయ్యాడు, నరేష్ డేంజర్ జోన్ లోకి వెళ్ళాడు.
దీంతో నామినేషన్స్ నుంచి తప్పించుకొని సేఫ్ జోన్ లోకి వచ్చిన సుధీర్, వంశీ, వర్షిణి, అమన్, త్రిగున్, రామ్ ప్రసాద్, దేబ్జానీ వీళ్ళే కెప్టెన్సీ కి పోటీ పడతారు. అని చెప్పాడు బిగ్ బాస్. ఝాన్సీ అడిగిన తన మ్యాజిక్ పవర్ ని ఇచ్చాడు బిగ్ బాస్. తన మ్యాజిక్ పవర్ లో ఎలిమినేషన్ నుంచి ఆ వారానికి సేవ్ అవుతారు అని ఉండి. దాంతో ఈ వారం నామినేషన్స్ నుంచి ఝాన్సీ సేవ్ అయింది. కానీ కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేరు అని చెప్పాడు బిగ్ బాస్. ఫైనల్ గా రోహిత్, ముకేశ్, షాలిని, చరణ్, అపూర్వ, నరేష్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.
ఏడుగురు కెప్టెన్సీ కంటెండర్ పోటీలో ఉన్నా అయిదుగురు మాత్రమే ఆడతారు. ఏ ఇద్దరు తప్పుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఏడుగురు కెప్టెన్సీ పోటీ ఆడాలి అనుకున్నారు. చివరకు ఓటింగ్ కి వెళ్లారు. అమన్, వర్షిణిని వద్దన్నారు. వర్షిణి ఆల్రెడీ ఈ వారం కెప్టెన్సీ కాపట్టి తనే ఓకే చెప్పింది. త్రిగున్ తో ఉన్న ఒప్పందం కోసం అమన్ తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అమన్ – తన అగ్నిపరీక్ష బ్యాచ్ దగ్గరకు వెళ్లి చెప్తే రోహిత్ ఎప్పట్లాగే వద్దు ఒప్పుకోకు నువ్వు ఆడు, వాళ్లకు గట్టిగా చెప్పు అని రెచ్చగొట్టాడు. దీంతో రోహిత్ చెప్పగానే మళ్ళీ అమన్ వచ్చి వర్షిణి, ఆ టీమ్ తో గొడవ పెట్టారు.
బిగ్ బాస్ అడిగిన ఇంతకీ ఇది తెగకపోవడంతో బిగ్ బాస్ ఓటింగ్ తో వెళ్లమన్నారు. అయినా అమన్ నేను ఒప్పుకోను అని బిగ్ బాస్ కి చెప్పాడు. దీంతో రోహిత్ తన అగ్నిపరీక్ష బ్యాచ్ తో కలిసి సెలబ్రిటీలతో గొడవ పడ్డాడు. ఇది ఇంతకీ తెగకపోవడంతో బిగ్ బాస్ సుధీర్, వంశీ , త్రిగున్, రామ్ ప్రసాద్, దేబ్జానీ లు కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొంటారు అని ప్రకటించాడు.
కెప్టెన్సీ టాస్క్ లో అయిదుగురు ఆడతారు. ఎవర్నినైనా ఇద్దర్ని సపోర్ట్ తీసుకోమన్నారు. దీంతో అమన్, ఝాన్సీ సపోర్ట్ తీసుకున్నారు. ఒక షిప్ మోడల్ ఇచ్చి ఆ షిప్ లాగా తయారు చేయాలి. దానికి సంబంధించిన భాగాలు బీన్ బ్యాగ్ లో ఉంటాయని చెప్పాడు. బీన్ బ్యాగ్స్ ని చింపి అందులో ఉన్న కొన్ని షిప్ భాగాలు తీసుకొని షిప్ ని తయారు చేయాలి. మొదట చేసిన ముగ్గురు నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు. ఇద్దరు ఎలిమినేట్ అవతారు. సుధీర్, వంశీ , రామ్ ప్రసాద్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు. త్రిగున్, దేబ్జానీ ఓడిపోయారు. నెక్స్ట్ లెవల్ కి సుధీర్ ఒక్కడే వెళ్ళాడు. సుధీర్ రిక్వెస్ట్ చేయడంతో ఝాన్సీ సపోర్ట్ చేసింది. దీంతో సుధీర్ అందరికంటే ముందు టాస్క్ ని పూర్తి చేసాడు. దీంతో సుధీర్ కొత్త కెప్టెన్ గా నిలిచాడు.
ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్ గా సుధీర్ గెలిచాడు. అనంతరం సుధీర్ గెలిచినందుకు అందరూ చర్చించుకున్నారు. రామ్ ప్రసాద్ కాళ్లకు సుధీర్ దండం పెట్టాడు. సుధీర్ గెలవడంతో ఎంత ట్రై చేసినా తమ బ్యాచ్ లోంచి ఎవరూ అవ్వలేదని అగ్నిపరీక్ష బ్యాచ్ మొహాలు మాడిపోయాయి. ఇదే విషయాన్ని సుధీర్ రామ్ ప్రసాద్ దగ్గర చెప్పాడు. సుధీర్ కెప్టెన్ అయినందుకు కెప్టెన్ కి ఇచ్చే గోల్డ్ మెడల్ ఇచ్చారు.
