Bigg Boss OTT 2 : అతడే కాదు.. ఎవరు ఉన్నా సరే లిప్‌లాక్ ఇచ్చేదాన్ని
హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ 2 సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆకాంక్ష పూరి (Akanksha Puri) షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. షో నుంచి బయటకు వచ్చిన తరువాత లిప్‌లాక్ గురించి ఎలిమినేషన్ తదితర విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించింది.

Akanksha Puri
Bigg Boss OTT 2- Akanksha Puri : బిగ్‌బాస్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. దాదాపుగా అన్ని బాషల్లో ఈ షో అలరిస్తోంది. ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ 2 సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ షోలో ఓ జంట కెమెరాలు ఉన్న విషయాన్ని మరిచిపోయారు. లిప్‌లాక్ ఇచ్చుకున్నారు. దీనిపై ప్రేక్షకులు మండిపడ్డారు. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ ఆ జంట పై సీరియస్ అయ్యారు. అనంతరం సండే ఎపిసోడ్‌లో ఆ జంట ప్రేక్షకులకు క్షమాపణలు సైతం చెప్పారు. అయినప్పటికీ ఇద్దరిలో ఒకరు అయిన ఆకాంక్ష పూరి (Akanksha Puri) షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.
ఇక షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఆకాంక్ష పూరి పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. లిప్‌లాక్ గురించి ఎలిమినేషన్ తదితర విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించింది. షో నుంచి బయటకు రావడం చాలా బాధగా ఉందని ఆమె చెప్పింది. అయితే ముద్దు విషయంలో మాత్రం తాను బాధపడడం లేదని తెలిపింది. ఓ టాస్క్ సందర్భంగా మాత్రమే తాను అలా చేశానని, కావాలని మాత్రం చేయలేదంది. 30 సెకన్ల పాటు ఈ ఛాలెంజ్ ఇచ్చారని, ఇందులో తప్పుగా చూడాల్సిన అవసరం లేదని, ఓ టాస్క్‌గా మాత్రమే పరిగణించాలని వెల్లడించింది.
Shahrukh Khan : షూటింగ్‌లో షారుఖ్‌కి ప్రమాదం.. అమెరికాలో సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..
వ్యక్తిగతంగా తనకు దీనిపై ఎలాంటి ఆసక్తి లేదని, జాద్ హదీద్ స్థానంలో మరొకరు ఉన్నా సరే తాను ఇదే పనిని చేసేదానినని చెప్పుకొచ్చింది. లిప్‌లాక్ విషయం ఎంత పెద్దది అయ్యిందో, సల్మాన్ ఖాన్ ఎందుకు అంత కోపంగా మాట్లాడారో తనకు బయటకు వచ్చిన తరువాతనే అర్థమైనట్లు తెలిపింది. ఆ సమయంలో ఇది ఇంత పెద్ద సమస్యగా మారుతుందని తాను ఊహించలేకపోయానంది. అయితే తాను ఏ మాత్రం తప్పుచేయలేదని మరోసారి చెప్పింది. అయితే.. ఆఖర్లో జాద్ హదీద్ అబద్ధాలకోరు, మూర్ఖుడు అని తాను భావిస్తున్నట్లు ఆకాంక్ష చెప్పుకొచ్చింది.