Bigg Boss OTT 2 : ముద్దు దుమారం.. ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ క్షమాపణలు.. వాళ్లకు వార్నింగ్.. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే షో నా..?
బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ 2(Bigg Boss OTT 2 ) సీజన్ ప్రసారం అవుతోంది. హదీద్, ఆకాంక్షలు చేసిన పనిపై వీకెంట్ ఎపిసోడ్ సందర్భంగా ముందుగా ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. అనంతరం వారిద్దరిపై మండిపడ్డాడు.
![Bigg Boss OTT 2 : ముద్దు దుమారం.. ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ క్షమాపణలు.. వాళ్లకు వార్నింగ్.. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే షో నా..? Bigg Boss OTT 2 : ముద్దు దుమారం.. ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ క్షమాపణలు.. వాళ్లకు వార్నింగ్.. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే షో నా..?](https://10tv.in/wp-content/uploads/2023/07/Salman-Khan-Warning.jpg)
Salman Khan Warning
Bigg Boss OTT 2- Salman Khan : బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ 2(Bigg Boss OTT 2 ) సీజన్ ప్రసారం అవుతోంది. సీజన్ ప్రారంభమైన 24 గంటల్లోనే ఓ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. బిగ్‌బిస్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. ఇక హౌస్మేట్స్ గొడవలు పడడం కలుసుకోవడం, ఆటలతో హుషారుగా షో సాగుతుండగా జాద్ హదీద్(Jad Hadid), ఆకాంక్షపూరి (Akanksha Puri)ల రొమాన్స్ ప్రేక్షకులకు వెగటు పుట్టించాయి. టాస్క్ జరుగుతుండగా వీరిద్దరూ ఫ్రెంచ్ కిస్ ఇచ్చుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan,) ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా ఇంత వరకు ఆయన ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉన్నారు. నో కిస్ సీన్ పాలసీని పాటిస్తున్నారు. ఇక ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోలో లిప్‌కిస్ చేసుకుంటే ఊరుకుంటారా..? సీజన్ ప్రారంభానికి ముందు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఎలాంటి అసభ్యతకు తావులేకుండా ఈ సీజన్ ఉంటుందని, కుటుంబ సభ్యులందరూ కలిసి సీజన్ చూడొచ్చునని భరోసా ఇచ్చారు కూడా.
హదీద్, ఆకాంక్షలు చేసిన పనిపై వీకెంట్ ఎపిసోడ్ సందర్భంగా ముందుగా ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. అనంతరం వారిద్దరిపై మండిపడ్డాడు. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే షోనా..? మరోదైనా షో అని అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదట కవర్ చేసుకునేందుకు వారు ప్రయత్నించారు. యాక్టింగ్ ఫీల్డ్‌లో ఇది సర్వసాధారణం అనగానే.. మీరు ఇక్కడికి సినిమాలో నటించడానికి, లేదంటే వెబ్ సిరీస్‌లో నటించడానికి రాలేదు.ఇదేమీ స్క్రిప్ట్ కాదు కదా.. ఇలా చేయండి అని మీరు ఎవరూ చెప్పలేదుగా అంటూ సల్మాన్ సీరియస్ అయ్యాడు. దీంతో వారు క్షమాపణలు చెప్పారు.
Jailer First Single : ‘వా నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి దా..దా..’
మీరు చేసిన పని కొందరు నచ్చవచ్చు కానీ చాలా మందికి మాత్రం నచ్చదు. కుటుంబ విలువలు, పెంపకం, సంస్కృతి ఇదేనా మనకు నేర్పింది అంటూ సల్మాన్ ప్రశ్నించారు. ఈ దేశం సాంప్రదాయాలకు విలువ ఇస్తుందన్న విషయాన్ని మరిచిపోకూడదని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, అదే జరిగితే డైరెక్టుగా ఎలిమినేట్ చేస్తానంటూ హౌస్‌మేట్స్‌కు సల్మాన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇకపోతే.. ఆదివారం ఎపిసోడ్లో ఆకాంక్ష పూరి ఎలిమినేట్ అయ్యింది.
Sonu Sood : హీరోయిన్ కోసం దోశెలు వేసిన రియల్ హీరో.. ఫైర్ అయిన నెటీజన్లు
View this post on Instagram