Sivaji : బిగ్‌బాస్ సీజన్ 7లో రెండవ కంటెస్టెంట్.. నటుడు శివాజీ.. ఆఫర్లు లేవా.. బిగ్‌బాస్ నుంచి రాజకీయాలు చేస్తారా?

బిగ్‌బాస్ సీజన్ 7లో రెండవ కంటెస్టెంట్ గా మన అందరికి తెలిసిన నటుడు శివాజీ వచ్చారు. శివాజీ గురించి మన అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆయన్ని సినిమాల్లో చూస్తున్నాం.

Sivaji : బిగ్‌బాస్ సీజన్ 7లో రెండవ కంటెస్టెంట్.. నటుడు శివాజీ.. ఆఫర్లు లేవా.. బిగ్‌బాస్ నుంచి రాజకీయాలు చేస్తారా?

Bigg Boss Season 7 second contestant Actor Sivaji re entry with bigg boss for his second innings

Actor Sivaji : తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో రెండవ కంటెస్టెంట్ గా మన అందరికి తెలిసిన నటుడు శివాజీ వచ్చారు. శివాజీ గురించి మన అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆయన్ని సినిమాల్లో చూస్తున్నాం.

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరోగా కూడా వరుస సినిమాలతో మెప్పించాడు. ఒకప్పుడు మంచి మంచి హిట్ సినిమాలతో కెరీర్ సూపర్ ఫాస్ట్ గా ఉండేది. ఆ తర్వాత వరుస సినిమాలు ఫెయిల్ అవ్వడంతో సినిమాలకు దూరమయ్యారు. 2016 లో చివరిసారిగా సీసా అనే సినిమాతో పలకరించిన శివాజీ 2018 లో ఓ వెబ్ సిరీస్ లో క్యారెక్టర్ చేశారు.

సినిమాలకు దూరమైనా శివాజీ తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సమయంలో, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కూడా పోరాటం చేశారు. బీజేపీ, టీడీపీ పార్టీల తరపున రాజకీయాల్లో యాక్టివ్ గా మాట్లాడారు శివాజీ. కానీ కొన్నాళ్ల నుంచి రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. సినిమాలకు, రాజకీయాలకు దూరమైన శివాజీ సడెన్ గా ఇలా బిగ్ బాస్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Priyanka Jain : బిగ్‌బాస్ సీజన్ 7 లో మొదటి కంటెస్టెంట్.. ప్రియాంక జైన్ గురించి తెలుసా?

గతంలో శివాజీ రాజకీయాల్లో పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల ఎక్కడా కనపడకవడంతో బిగ్ బాస్ లో వచ్చారని, ఇక్కడ కొంచెం మళ్ళీ ఫేమ్ తెచ్చుకొని రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని, త్వరలో ఏపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు శివాజీ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని, బిగ్ బాస్ తర్వాత టీవీ, సిరీస్, సినిమాలలో మళ్ళీ యాక్టివ్ అవ్వాలనుకుంటున్నాడు శివాజీ అని మరికొంతమంది అంటున్నారు. మరి శివాజీ బిగ్ బాస్ లో ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో చూడాలి. బిగ్ బాస్ లో కనుక శివాజీ పాలిటిక్స్ మాట్లాడితే ఈ సారి షో మరింత రచ్చగా ఉండటం గ్యారెంటీ..