Bigg Boss Today Promo : షాలినీ, రామ్ ప్రసాద్‌ల మధ్య మాటల యుద్ధం.. నీకు అన్నా అనే గౌరవం ఉంటే వెంటనే.. సందిగ్ధంలో దేబ్జానీ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రొమో (Bigg Boss Today Promo )వచ్చేసింది.
Bigg Boss Telugu 10 Day 9 Today Promo 2 Ramprasad and Shalini fight
Bigg Boss Today Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రొమో వచ్చేసింది. ఈ సీజన్ 10లో తొలి కెప్టెన్ అయ్యేందుకు త్రిగుణ్ , దేబ్జానీ, అమన్, షాలినీ , ముఖేష్, రోహిత్, ఝాన్సీ, రాం ప్రసాద్‌లు పోటీపడుతున్నారు. ఒక్కో కెప్టెన్సీ కంటెండర్ పైనా నాలుగు బెలూన్స్ ఉంటాయి. చివరి వరకు ఎవరి నెత్తి మీద అయితే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్లే కెప్టెన్ అవుతారు.
మీరు నా కన్నా స్ట్రాంగ్ కాబట్టి అని చెబుతూ రామ్‌ప్రసాద్ బెలూన్ను రోహిత్ పగలగొట్టాడు. ఇందాక నువ్వే చెప్పావు స్ట్రాంగ్ కాంపిటేటర్ను తీయకూడదు అని రామ్ ప్రసాద్ ప్రశ్నించగా.. నా మనసు మార్చుకున్నాను అని రోహిత్ సమాధానం ఇచ్చాడు. నాకు ఇంతకన్నా మంచి పాయింట్ దొరకదు లైఫ్‌లో నిన్ను నామినేట్ చేయడానికి అని రామ్‌ప్రసాద్ అన్నాడు. ఆ తరువాత ఝాన్సీ రోహిత్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో త్రిగుణ్ రావడంతో నువ్వు ఎందుకు వస్తున్నావ్ అని రోహిత్ అన్నాడు.
Samantha Baby Shower : సమంత సీమంతం.. మరికొన్ని ఫొటోలు.. వైరల్
ఆతరువాత రామ్ ప్రసాద్, షాలినీల మధ్య వాగ్వాదం జరిగింది. సండే రోజు నాగ్ సార్ ఓ ఫన్ గేమ్ ఆడిస్తున్నారు. మీరు (రామ్‌ప్రసాద్) వెళ్లి దేబ్జానీతో ఎందుకు రౌండప్ చేయించారు? అని అడిగింది. ఆ రోజు గెలిచింది నేను అని రామ్‌ప్రసాద్ అనగా.. ఆ రోజు మీరు చేసింది నాకు నచ్చలేదని చెప్పింది షాలినీ. ఆ తరువాత అన్నా అనే గౌరవం ఉంటే వెంటనే షాలినీ బెలూన్ పేల్చు అని దేబ్జానీకి రామ్ ప్రసాద్ చెప్పాడు. ఆ తరువాత దేబ్జానీ, షాలినీ ల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సీజన్ తొలి కెప్టెన్ ఎవరు అయ్యారు? రామ్ ప్రసాద్ చెప్పినట్లుగా షాలినీ బెలూన్ను దేబ్జానీ పగలకొట్టిందా? తెలియాలంటే పుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
