మహేష్ కాదు.. పునర్నవి అవుట్.. బిగ్ బాస్ ట్విస్ట్

బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని అలకలు, కొన్ని ఏడుపులు, కొన్ని టాస్కులు, నామినేషన్ లు అన్నట్లుగా బిగ్ బాస్ షో ముందుకు సాగుతుంది. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే బిగ్ బాస్ షో లో ఎలిమినేషన్ ఎవరు అనే విషయం ప్రతీసారి ముందుగానే అందరికీ తెలిసిపోతుంది. వారానికి ఓ ఎలిమినేషన్ లో బాగంగా ప్రతీవారం మాదిరిగానే ఈ వారం బిగ్ బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. అయితే ప్రతీసారి ఎలిమినేట్ అయ్యేవారి గురించి ముందే తెలిసిపోతుండగా.. ఈ వారం మాత్రం ముందుగా మహేష్ అవుట్ అయిపోతున్నట్లు చూపించి తర్వాత బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారట.
ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా ఉండగా.. శనివారం ప్రసారమైన ఎపిసోడ్ లో రాహుల్ సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అయితే ప్రస్తుతం నామినేషన్ లో ఉన్నది పునర్నవి మహేష్ విట్ట వరుణ్ సందేశ్. దీంతో మహేష్ విట్ట బిగ్ బాస్ 3 హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఈ ఫీలర్లను వదిలింది బిగ్ బాస్ నిర్వాహకులే అట. చివరకు మాత్రం మహేష్ విట్టా బిగ్ బాస్ 3 హౌస్ లోనే ఉండబోతున్నాడని పునర్నవి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతుందని తెలుస్తుంది.
బిగ్‌బాస్ చిన్నపాటి లాజికల్ గేమ్ ఆడడంతో మహేశ్ హౌస్ నుంచి వెళ్లిపోతున్నట్టు బిగ్‌బాస్ నుంచి లీక్‌లు వచ్చాయి. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని, పునర్నవినే హౌస్ నుంచి వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే కాస్త సస్పెన్స్ గా చేద్దామని భావించినా కూడా ఎవరు ఎలిమినేట్ అయ్యారనే లీకులు కూడా బయటకు వచ్చేశాయి. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో నవరాత్రి వేడుకల సందర్బంగా హౌస్‌మేట్స్ నవరసాలను ప్రదర్శించనున్నారు. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది.