Bigg Boss 7 : ఆడపిల్లవి అడ్వాంటేజ్ తీసుకోవద్దు.. శోభాశెట్టిపై శివాజీ ఫైర్
Bigg Boss Telugu 7 Day 96 Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు వచ్చేసింది. మరో 10 రోజుల్లో విజేత ఎవరో తేలిపోనుంది.

Bigg Boss Telugu 7 Day 96 Promo
Bigg Boss Telugu 7 Day 96 Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు వచ్చేసింది. మరో 10 రోజుల్లో విజేత ఎవరో తేలిపోనుంది. అంబటి అర్జున్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు. అతడు తప్ప ఈ వారంలో మిగిలిన ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఇందులో శివాజీ, శోభాశెట్టిలకు మధ్య వాదన కాస్త గట్టిగానే జరిగినట్లు కనిపిస్తోంది.
అంబటి అర్జున్, ప్రియాంక, శివాజీ లు టాస్క్‌లో భాగంగా త్రో బాల్ గేమ్ ఆడుతున్నారు. దీనికి శోభాశెట్టి సంచాలక్‌గా ఉంది. ఒకరిపై మరొకరు బాల్స్ విసిరేసుకుంటుండగా ప్రియాంక జాగ్రత్తగా ఆడు అంటూ శోభాశెట్టి పలు మార్లు అనిపింది. దీంతో శివాజీకి చిర్రెత్తుకొచ్చింది. నేను ఆడాను అంటూ బాల్స్ విసిరేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రియాంకా.. ప్రియాంకా అంటుంటే మేము ఏం ఇంక ఎందుకు వచ్చినట్లు అంటూ మండిపడ్డాడు.
Amma Rajasekhar : ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో నా దగ్గర ఏడ్చేసింది.. అమ్మ రాజేశేఖర్ కామెంట్స్ వైరల్
యావర్ వచ్చి అన్న ఆడు అన్నా అని శివాజీ అడుగగా అతడు మాత్రం వినలేదు. సంచాలక్ గా ఉండి సపోర్ట్ చేస్తావా..? అంటూ శోభాను శివాజీ ప్రశ్నించాడు. తాను ఎవరికైనా సపోర్ట్ చేస్తానని, అది తన ఇష్టమంటూ శోభా చెప్పుకొచ్చింది. సంచాలక్ అంటే అందరికి సమ న్యాయం చేయాలని శివాజీ అన్నాడు. దీంతో మీలా నటించడం లేదని, ఎటు కెమెరాలు ఉన్నాయో చూసి మరీ యాక్టింగ్ చేస్తున్నారంటూ శివాజీ పై అరిచింది శోభా. దీంతో ఆడపిల్లవి అడ్వాంటేజ్ తీసుకోవద్దని శివాజీ అన్నాడు. మొత్తం మీద ఇద్దరి మధ్య గొడవ కాస్త గట్టిగానే జరిగినట్లుగా తెలుస్తోంది.