Amma Rajasekhar : ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో నా దగ్గర ఏడ్చేసింది.. అమ్మ రాజేశేఖర్ కామెంట్స్ వైరల్
ఎంతో భవిష్యత్ ఉన్న నటి ఆర్తి అగర్వాల్ చాలా చిన్న వయసులో కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆమె తనతో పంచుకున్న మాటలను తాజాగా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మీడియాతో షేర్ చేసుకున్నారు.

Amma Rajasekhar
Amma Rajasekhar : టాలీవుడ్‌లో టాప్ హీరోలందరికి జోడీగా నటించిన నటి ఆర్తి అగర్వాల్ ఎంతో భవిష్యత్ ఉండగా అనూహ్యంగా కన్నుమూశారు. డైరెక్టర్, నటుడు అమ్మ రాజశేఖర్ ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటలు ఇటీవల మీడియాతో షేర్ చేశారు.
ఆర్తి అగర్వాల్ 16 వ ఏట ‘పాగల్ పన్’ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో విక్టరీ వెంకటేష్‌కి జోడిగా ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2006 నుండి వ్యక్తిగత కారణాలతో డౌన్ ఫాల్ ప్రారంభమై సినిమాలకు దూరమయ్యారు. 2007 లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లాడి 2009 లో విడాకులు తీసుకున్నారు. 2015 లో లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్న ఆరువారాల తర్వాత శ్వాస సంబంధ సమస్యతో 31 సంవత్సరాల వయసులో కన్నుమూసారు ఆర్తి అగర్వాల్. తాజాగా ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటలను డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మీడియాతో పంచుకున్నారు.
Vijay Rashmika : నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో విజయ్ రష్మిక రిలేషన్ గురించి..
అమ్మ రాజశేఖర్ 2015 లో డైరెక్ట్ చేసిన రణం 2 సినిమాలో ఆర్తి అగర్వాల్ నటించారు. నటుడు శ్రీహరికి అనారోగ్య కారణాలతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిందట. ఆ సమయంలో 6 నెలల గ్యాప్ తర్వాత షూటింగ్‌కి వచ్చిన ఆర్తి అగర్వాల్‌ని చూసి షాకయ్యానని చెప్పారు అమ్మ రాజశేఖర్. విపరీతంగా వెయిట్ గెయిన్ అయిన ఆర్తి అగర్వాల్ కాస్ట్యూమ్ సెట్ కాలేదని బాగా ఏడ్చేసారట. తను ఇంక బయటకు రాలేనని ఆవేదనతో చెప్పారని అమ్మ రాజశేఖర్ చెప్పారు. అదే సంవత్సరం బరువు తగ్గడం కోసం చేయించుకున్న లైపోసక్షన్ సర్జరీ ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. చిన్న వయసులోనే ఆర్తి కన్నుమూశారు.