Bigg Boss Telugu 8 Day 25 Promo 2 Bigg Boss Unexpected Twist
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయని బిగ్‌బాస్ వెల్లడించాడు. అయితే.. వారు రాకుండా అడ్డుకునే పవర్ సైతం హౌస్‌మేట్స్‌కు ఉందన్నాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ గెలిచిన ప్రతి సారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చునని అన్నాడు. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదలైంది.
సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ కి కాంతార క్లాన్ నుంచి అనర్హులు అనుకున్న ఒకరిని తీసివేయాల్సిందిగా శక్తి క్లాన్ సభ్యులకు బిగ్‌బాస్ సూచించాడు. నిఖిల్ లేచి నబీల్ పేరును చెప్పాడు. దీంతో విష్ణు ప్రియతో పాటు కిర్రాక్ సీత, ప్రేరణ తదితరులు షాక్ అయ్యారు. నిఖిల్ టూ షేడెడ్ పర్సన్ అని విష్ణు ప్రియ అంది. మణికంఠని ఎందుకు తీసివేశారు మీ క్లాన్ నుంచి అని ప్రేరణ అడుగగా.. మణి తనంట తానే వెళ్లిపోతానని చెప్పినట్లుగా సోనియా అంది.
ఆ తరువాత మణికంఠ, యష్మీల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వేరే వారిని బ్యాడ్ చేయొద్దు ఇక్కడ అంటూ మణికంఠ పై యష్మి అరిచింది. మొత్తంగా ప్రొమో చూస్తుంటే శక్తి క్లాన్ సభ్యులతో మణికంఠకు గొడవ జరిగినట్లుగా అర్థమవుతోంది. ఈ క్రమంలో తన నోటిని మూసుకుంటా.. మాట్లాడను.. అని మణికంఠ అనగా.. థ్యాంక్యూ సో మచ్ అంటూ సోనియా అంది. స్ట్రాంగ్ ఉన్న వాళ్లు అడాలి.. గెలిపించాలి.. వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ అన్నట్లుగా ఉండేది.. ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్‌గా మారిపోయింది అంటూ కిర్రాక్ సీత మండిపడింది.