Pawan Kalyan – Krishna Vamsi : పవన్ కళ్యాణ్ నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్.. డైరెక్టర్ కృష్ణవంశీ వరుస సంచలన ట్వీట్లు..
తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ అంటూ వరుస సంచలన ట్వీట్లు చేసారు.

Director Krishna Vamsi Tweets on Pawan Kalyan with Comparing to Yogi Adityanath
Pawan Kalyan – Krishna Vamsi : ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలంగా నిలబడి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇన్నాళ్లకు బలంగా సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకుడు సౌత్ లో వచ్చారని పవన్ కళ్యాణ్ గురించి పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ అంటూ వరుస సంచలన ట్వీట్లు చేసారు. డైరెక్టర్ కృష్ణ వంశీ రెగ్యులర్ గా ట్విట్టర్లో నెటిజన్లతో ముచ్చటిస్తారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తారు.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఇష్యూపై మీరేమంటారు అని అడగ్గా కృష్ణవంశీ.. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద నాకు బోలెడంత గౌరవం, ప్రేమ ఉన్నాయి. అవినీతిపరమైన, కలుషితమైన రాజకీయ నాయకుల మధ్యలో ఒకరు విలువల కోసం నిలబడుతున్నారు. దేవుడు ఆయనతో ఎప్పుడూ ఉండాలి అని అన్నారు.
I hv respects n lots of love n regards towards our beloved dept CM PAWAN KALYAN garu …. Finally in d corrupt n polluted politics somebody is trying hard to uplift d values n standards n sanity … GOD b with him always ❤️🙏🙏❤️❤️🙏 https://t.co/bPIovm608k
— Krishna Vamsi (@director_kv) September 25, 2024
దీంతో పవన్ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ గా బోలెడన్ని ట్వీట్స్ కృష్ణవంశీకి వచ్చాయి. ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసినందుకు కృష్ణవంశీకి ధన్యవాదాలు పెడుతూ ట్వీట్ చేయగా కృష్ణవంశీ స్పందిస్తూ.. థ్యాంక్యూ అండి. నిజం ఎప్పటికీ నిజమే. పవన్ కళ్యాణ్ రియల్ హీరో. ఆయన మళ్ళీ మళ్ళీ అది ప్రూవ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి నాయకులు మనకు చాలా మంది కావాలి. యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ కళ్యాణ్ స్పెషల్ పొలిటీషియన్ గా నేను ఫీల్ అవుతున్నాను అని ట్వీట్ చేసారు. దీంతో ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ ని యోగి అదిర్యనాథ్ తో పోల్చకండి అని చెప్పడంతో.. నేను కచ్చితంగా చెప్పగలను పవన్ కళ్యాణ్ నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ అని చెప్పారు కృష్ణవంశీ. దీంతో కృష్ణవంశీ ట్వీట్స్ వైరల్ గా మారాయి.
THQ somuch Andi 🙏💕 truth is always truth sir .. dnt need anybody's acknowledgement… PK is real life HERO .. he proving it again n again .. v need more politicians like him .. after YOGI ADITYANATH he is a serene ,sane n special politician I feel .. God bless him always … https://t.co/hUEeMT4aYY
— Krishna Vamsi (@director_kv) September 25, 2024
Am sure PK is next YOGI due respect to ur opinion sir ❤️🙏 https://t.co/baOSbeRG70
— Krishna Vamsi (@director_kv) September 25, 2024