Bigg Boss 8 : కంటెస్టెంట్లతో నాగార్జున జోకులు.. వైల్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా ఆఖరి రోజు..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఐదో వారం చివరికి వచ్చేసింది.

Bigg Boss Telugu 8 Day 34 Promo 1 Nagarjuna Fun with Contestants
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఐదో వారం చివరికి వచ్చేసింది. ప్రతివారం శనివారం రోజున ఆ వారం జరిగిన టాస్క్‌ల పై నాగార్జున విశ్లేషణ చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఇక నేడు శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. ఆదివారం వైల్ కార్డు ఎంట్రీస్ వస్తున్నారు అంటూ ఇన్‌డైరెక్ట్‌గా నాగార్జున చెప్పారు.
గుర్తు పెట్టుకోండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా ఇవాళే మీకు ఆఖరి రోజు అని నాగార్జున కంటెస్టంట్లతో అన్నారు. ఆ తరువాత హౌస్‌మేట్స్ కు ఓ గేమ్ పెట్టాడు. ప్రతి ఒక్కరు రెండు అద్దాలు తీసుకోవాలన్నారు. ఈ అద్దంలో హౌస్‌లో ఎవరి ఫేస్ చూపించాలని అనుకుంటున్నారో చెప్పాలన్నారు.
నిఖిల్ ఫేస్‌ను చూపెడుతూ చీఫ్ పదవి నుంచి దిగిపోయిన తరువాత నా కంటే చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడని విష్ణు ప్రియ అంది. చీఫ్ నుంచి దిగిపోయాకనా.. సోనియా వెళ్లిపోయాకనా అని నాగార్జున ప్రశ్నించారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఆ తరువాత ఒక్కొక్కరుగా అద్దాలలో తాము ఎవరిని చూపించాలని అనుకుంటున్నారో వాళ్లని చూపించారు. ఇక ఆఖరిలో యష్మి ఏడ్చింది.
వాళ్ల నాన్నపంపిన మెసేజ్‌లో ఓ మూడు పదాలను చెబుతానని, అయితే.. అందుకు ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పని సీక్రెట్‌ను చెప్పాలని నాగ్ అన్నారు. దీంతో కాలేజీ రోజుల్లో తాను ఓ అబ్బాయిని ప్రేమించానని యష్మి అంది. తన చేతిపై టాటూగా వేసుకున్న ఆర్, ఎస్ అంటూ చూపించింది. అయితే.. పేరు మాత్రం వద్దని అంది. మొత్తంగా ప్రొమో అదిరిపోయింది.
Womens T20 World Cup 2024 : కివీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే..?