Bigg Boss 8 : ఎలిమినేషన్స్‌లో ట్విస్ట్? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం చివరికి వచ్చేసింది

Bigg Boss Telugu 8 This week Doubl elimination
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం చివరికి వచ్చేసింది. దీంతో అందరి దృష్టి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు అనే దాని పై ఉంది. 14 మందితో షో ప్రారంభమైంది. ప్రస్తుతం హౌస్‌లో 11 మంది ఉన్నారు. వీరిలో ఈ వారం ఆరుగురు నాగ మణికంఠ, ప్రేరణ, నబీల్, సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ లు నామినేట్‌లో ఉన్నారు. మరో రెండు వారాల్లో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని ఇప్పటికే బిగ్‌బాస్ చెప్పిన సంగతి తెలిసిందే.
నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో నబిల్‌కు ఎక్కువ ఓట్లు పడినట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రేరణ, నాగ మణికంఠలకు సైతం మంచిగానే ఓట్లు పడ్డాయట. ఇక డేంజర్‌లో మాత్రం పృథ్వీ, సోనియా, ఆదిత్య ఓం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ వారం బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. ఆదిత్య ఓం ఎలిమినేట్ కానున్నాడని టాక్. ఇక సోనియాను సైతం ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఆమెను ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తారని టాక్ నడుస్తోంది. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏదీ ఏమైనప్పటికి ఆదిత్య ఓం మాత్రం బయటకు రానున్నాడనే టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడక తప్పదు.