Bigg Boss 5 : ‘బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’..

‘కింగ్’ నాగార్జున మరోసారి బుల్లితెర ప్రేక్షకులను, అక్కినేని అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు..

Bigg Boss 5 : ‘బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’..

Bigg Boss 5

Bigg Boss 5: ‘కింగ్’ నాగార్జున మరోసారి బుల్లితెర ప్రేక్షకులను, అక్కినేని అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అందరూ అనుకుంటున్నట్టుగానే ‘బిగ్ బాస్’ కొత్త సీజన్‌ను నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫమ్ చేస్తూ నాగ్ ప్రోమో వదిలారు స్టార్ మా టీం.

Nagarjuna : ‘బిగ్ బాస్ 5’ షూటింగ్‌లో నాగార్జున.. లుక్ అదిరిందిగా..!

‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. 3, 4 సీజన్ల తర్వాత ఇప్పుడు 5th సీజన్ స్టార్ట్ కాబోతోంది. వరుసగా మూడోసారి కూడా అక్కినేని అందగాడే హోస్ట్ చెయ్యబోతున్నారు. హాట్ సీట్‌లో కూర్చుని ప్రశ్నలడిగినా, హౌస్‌లో కంటెస్టెంట్లను కంట్రోల్ చేసినా.. మోర్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తన స్టైల్ మేనరిజమ్స్‌తో, మంచి ఈజ్ అండ్ ఎనర్జీతో అలరించారు నాగ్.

Aata Sandeep : ‘బిగ్ బాస్-5’ లో డ్యాన్సింగ్ కపుల్..

ఇక ప్రోమో విషయానికొస్తే.. లాక్‌డౌన్ నుండి బోర్‌డమ్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న ఆడియెన్స్‌ని దాని నుండి బయట పడేయడానికి, మోర్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వారి జీవితాల్లో నవ్వుల వెలుగులు పంచడానికి తాను రాబోతున్నట్టు తెలిపారు ‘బిగ్ బాస్’..

Bigg Boss 5 : మోర్ ఫన్.. మోర్ ఎంటర్‌టైన్‌మెంట్..

నాగ్ కాస్ట్యూమ్స్, మేనరిజమ్స్ ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అనే రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా 60 పైబడ్డా ఇంకా యంగ్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు నవ యువ మన్మథుడు నాగ్. ఇక ప్రోమో చివర్లో నాగ్ చెప్పిన ‘చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్’.. డైలాగ్ అయితే అదిరిపోయింది. త్వరలో ‘బిగ్ బాస్ సీజన్ 5’ స్టార్ మా లో టెలికాస్ట్ కానుంది.