Bigg Boss 8 – Prithviraj Shetty : బిగ్ బాస్ సీజన్ 8.. పదకొండో కంటెస్టెంట్.. పృథ్విరాజ్ శెట్టి గురించి తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పదకొండో కంటెస్టెంట్ గా నటుడు పృథ్వీరాజ్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు.
Bigg Boss 8 – Prithviraj Shetty : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున హోస్టింగ్ తో స్వాగతం చెప్తుండగా కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల, ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క, ఎనిమిదో కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ బాషా, తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి కిరాక్ సీత, పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ రాగా పదకొండో కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్ శెట్టి వచ్చాడు.
Also Read : Bigg Boss 8 – Naga Manikanta : బిగ్ బాస్ సీజన్ 8.. పదో కంటెస్టెంట్.. నాగ మణికంఠ.. ఎవరితను?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పదకొండో కంటెస్టెంట్ గా నటుడు పృథ్వీరాజ్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు. కన్నడకు చెందిన నటుడు పృథ్విరాజ్ శెట్టి తెలుగులో నాగ పంచమి సీరియల్, నీతోనే డ్యాన్స్ షోలతో పాపులర్ అయ్యాడు. కన్నడలో కూడా సీరియల్స్, సినిమాలు చేస్తూ తెలుగులో నటిస్తున్నాడు. ఈ కన్నడ అబ్బాయి కూడా ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.