Bigg Boss Eliminations : బిగ్‌బాస్‌ లోకి వాళ్ళని తీసుకురావడం ఎందుకు? వాళ్ళిద్దర్నీ మొదట్లోనే పంపించేయడం ఎందుకు?

అయితే ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ లో కిరణ్ రాథోడ్(Kiran Rathore), షకీలా(Shakeela).. లాంటి ఒకప్పటి స్టార్ బోల్డ్ ఆర్టిస్టులని తీసుకొచ్చారు. ఒకప్పుడు వీళ్ళు అలాంటి పత్రాలు చేసినా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Bigg Boss Eliminations : బిగ్‌బాస్‌ లోకి వాళ్ళని తీసుకురావడం ఎందుకు? వాళ్ళిద్దర్నీ మొదట్లోనే పంపించేయడం ఎందుకు?

Bigg Boss Why Eliminate Shakeela and Kiran Rathore in First two weeks

Updated On : September 20, 2023 / 2:57 PM IST

Bigg Boss Eliminations :  బిగ్‌బాస్‌ సీజన్ 7 మొదలయి అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ లో అందరూ బాగా ఫేమస్ కాకపోయినా అందరికి తెలిసిన కంటెస్టెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు గేమ్ గెలిచినా గెలవకపోయినా ఎక్కువ రోజులే హౌస్ లో ఉంటారని అంతా అనుకున్నారు. హౌస్ లో గ్లామర్ కూడా ఉండేలా చూసుకుంటాడు బిగ్‌బాస్‌. దీంతో కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ ని చివరి వరకు ఉంచుతాడు.

అయితే ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ లో కిరణ్ రాథోడ్(Kiran Rathore), షకీలా(Shakeela).. లాంటి ఒకప్పటి స్టార్ బోల్డ్ ఆర్టిస్టులని తీసుకొచ్చారు. ఒకప్పుడు వీళ్ళు అలాంటి పాత్రలు చేసినా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వీళ్ళని తీసుకురావడంతో వీళ్ళు ఎక్కువ రోజులే ఉంటారని అంతా భావించారు. కానీ మొదటివారం కిరణ్ రాథోడ్ ని, రెండో వారం షకీలాని పంపించేశారు. షకీలా లాంటి స్టార్ యాక్టర్ ని రెండో వారం పంపించేయడంతో అంతా షాక్ అవుతున్నారు.

షకీలా బాగా ఆడినా, అందర్నీ మెప్పించిన, హౌస్ లో కూడా అందరితో మంచిగా ఉన్నా బిగ్‌బాస్‌ రెండోవారం షకీలాని పంపించేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బిగ్‌బాస్‌ బయట ఆడియన్స్ నుంచి వచ్చిన ఓట్లతోనే పంపిస్తామని చెప్పినా అది జరగదని, వాళ్లకి నచ్చిన వాళ్ళని, వాళ్లకి టిఆర్పి తెప్పించేవాళ్ళని, తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళని ఉంచుకొని మిగిలిన వాళ్ళని తొందరగా పంపించేస్తారని చాలా మందికి తెలిసిందే.

Bigg Boss 7 Day 14 : బిగ్‌బాస్‌లో కట్టప్ప ఎవరు? భళ్లాలదేవ ఎవరు?.. మళ్ళీ లేడి కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్..

దీంతో ఈ లెక్కలు వేసుకొనే బిగ్‌బాస్‌ నుంచి కిరణ్ రాథోడ్, షకీలాని మొదటి రెండు వారాల్లోనే పంపించేశారని భావిస్తున్నారు. అసలు షకీలా, కిరణ్ కంటే అసలు తెలియని వాళ్ళు కూడా హౌస్ లో ఉన్నా.. గేమ్ ఆడని వాళ్ళు ఉన్నా వీళ్ళని పంపించడంతో ఎందుకు వీళ్ళని తీసుకురావడం, ఎందుకు మొదటి వారాల్లోనే పంపించేయడం అని కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.