VJ Sunny : బిగ్‌బాస్‌ నాకేమి ఉపయోగపడలేదు.. మాజీ బిగ్‌బాస్‌ విన్నర్ వీజే సన్నీ

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీజే సన్నీ మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్‌ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. అందుకే బిగ్‌బాస్‌ విన్నర్‌ అని చెప్పుకోవడం కూడా మానేశాను. కొంతమందిని కలిసినపుడు నేను..............

VJ Sunny : బిగ్‌బాస్‌ నాకేమి ఉపయోగపడలేదు.. మాజీ బిగ్‌బాస్‌ విన్నర్ వీజే సన్నీ

BiggBoss Season 5 Winner VJ Sunny Sensational Comments on BiggBoss

Updated On : September 10, 2022 / 1:54 PM IST

VJ Sunny :  సాధారణంగా బిగ్‌బాస్‌ లో పాల్గొనే వాళ్ళకి డబ్బులు, ఫేమ్ బాగా వస్తుంది. అవకాశాలు వచ్చినా రాకపోయినా డబ్బులు, ఫేమ్ వస్తాయని అందరూ బిగ్‌బాస్‌ కి వెళ్లాలని అనుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టే డబ్బులు వస్తాయి, సోషల్ మీడియాలో, బయట ఫేమ్ కూడా వస్తుంది. కానీ అవకాశాలు వస్తాయో, రావో చెప్పలేము. బిగ్‌బాస్‌ లో పాల్గొని తర్వాత కనుమరుగయిన వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్‌బాస్‌ లో వచ్చిన ఫేమ్ తో అవకాశాలు తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు. చాలా మంది గత సీజన్స్ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ అసలు కనపడకుండా పోయారు.

తాజాగా బిగ్‌బాస్‌ పై మాజీ విన్నర్ వీజే సన్నీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్‌ సీజన్ 5 విన్నర్ గా వీజే సన్నీ మంచి ఫేమ్ సంపాదించాడు. అంతకుముందే సీరియల్స్ లో ఆర్టిస్ట్ గా ఫేమ్ ఉన్న సన్నీ సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించేవాడు. బిగ్‌బాస్‌ తనకి కలిసొస్తుందని, తనకి అవకాశాలు వస్తాయని వెళ్ళాడు. కానీ సీజన్ విన్నర్ గా నిలిచినా తనకి అవకాశాలు మాత్రం రావట్లేదంటూ వాపోతున్నాడు.

BiggBoss 6 Day 5 : మొత్తానికి ఫస్ట్ కెప్టెన్ బాలాదిత్య.. వరస్ట్ పర్ఫార్మర్ గీతూ.. అనుకున్నదే అయిందిగా..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీజే సన్నీ మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్‌ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. అందుకే బిగ్‌బాస్‌ విన్నర్‌ అని చెప్పుకోవడం కూడా మానేశాను. కొంతమందిని కలిసినపుడు నేను బిగ్‌బాస్‌ విన్నర్‌ అని చెప్తుంటే అంటే ఏంటి అని అడుగుతున్నారు. బిగ్‌బాస్‌ షో వల్ల నాకు ఫేమ్‌, నేమ్‌ వచ్చాయి, కాదనను. కానీ అది నా కెరీర్ కి మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. అందుకే బిగ్‌బాస్‌ విన్నర్‌ అని చెప్పుకోవడం మానేసి నా సీరియల్స్, సినిమాల మీద దృష్టి పెట్టాను” అని అన్నారు.