KGF2: హిందీలో కేజీఎఫ్ సునామీ.. రాఖీభాయ్ ఖాతాలో మరో రికార్డ్ ఖాయం!
సరిగ్గా పదిరోజుల క్రితం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన కేజీఎఫ్ 2 కన్నడ సినిమా అయినా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలుకొడుతోంది. తూఫాన్ కంటే స్పీడ్ గా సునామి లాంటి కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాల కలెక్షన్ల రికార్డులన్నింటినీ మాన్ స్టర్ లాగా మింగేసింది కెజిఎఫ్2.

KGF2
KGF2: సరిగ్గా పదిరోజుల క్రితం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన కేజీఎఫ్ 2 కన్నడ సినిమా అయినా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలుకొడుతోంది. తూఫాన్ కంటే స్పీడ్ గా సునామి లాంటి కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాల కలెక్షన్ల రికార్డులన్నింటినీ మాన్ స్టర్ లాగా మింగేసింది కెజిఎఫ్2. రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతున్నా ఏమాత్రం కలెక్షన్లు తగ్గకుండా నాన్ స్టాప్ రికార్డులతో దూసుకుపోతూ బాలీవుడ్ కి చుక్కలు చూపిస్తోంది. ఇక్కడా.. అక్కడా అని లేదు.. కెజిఎఫ్ ఎక్కడ కాలు పెట్టినా.. కలెక్షన్ల కుమ్ముడే అంటున్నారు ఫాన్స్.
KGF2: కేజీయఫ్2 8 రోజుల కలెక్షన్లు.. తగ్గేదేలే అంటోన్న రాఖీ భాయ్!
వారం రోజుల్లోనే బాలీవుడ్ స్టార్ల రికార్డులు బద్దలు కొట్టిన కెజిఎఫ్ ఇప్పుడు హిందీ ఆల్ టైం మరో రికార్డుకు సిద్ధమైంది. ఇప్పటికే నార్త్ లో రూ.200 కోట్లను దాటి పరుగులు పెడుతున్న కేజీఎఫ్ 2 మరో సెన్సషనల్ మైల్ స్టోన్ 300 కోట్లకి జస్ట్ దగ్గరలో ఉంది. శనివారం హిందీ వెర్షన్ 18 కోట్లకి పైగా నెట్ వసూళ్ళని అందుకొని 298 కోట్లకి చేరగా.. ఈరోజు ఆదివారంతో ఈ చిత్రం 300 కోట్ల మార్క్ ని క్రాస్ అయ్యిపోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
KGF2: కేజీఎఫ్ విక్టరీ వెనుక ఆ ముగ్గురు.. అసలెలా పట్టుకున్నారు?
ఈ ఆదివారంతో కేజేఎఫ్ 2 రూ.300 కోట్లను దాటి రూ.400 కోట్ల క్లబ్ వైపు పరుగులు మొదలవుతుంది. ఈ సినిమాలో యశ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు కేవలం నార్త్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాను చూసేందుకు అక్కడి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో ఈ సినిమా ఉత్తరాదిన భారీ రెస్పాన్స్ దక్కించుకుంటుంది.