Akhil Mishra : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాలీవుడ్ నటుడు మృతి..
బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు..

Bollywood actor Akhil Mishra passed away news in telugu
Akhil Mishra : ప్రముఖ బాలీవుడ్ (Bollywood) నటుడు అఖిల్ మిశ్రా నేడు కన్నుమూశారు. ఈయన మరణానికి గల సరైన కారణం ఇంకా తెలియడం లేదు. మృతి గల కారణాలు పలు వినిపిస్తున్నాయి. కిచెన్ లో వర్క్ చేస్తున్న సమయంలో కాలుజారి కింద పడడం వలన తలకి గాయం తగిలి మరణించినట్లు కొందరు పేర్కొంటున్నారు. మరికొందరేమో ఆయన పెద్ద బిల్డింగ్ బాల్కనీ నుంచి పడిపోయినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే దీని పై కుటుంబసభ్యుల నుంచి ఒక క్లారిటీ రావాల్సింది.
Sharwa35 : కృతిశెట్టికి బర్త్ డే విషెస్.. శర్వానంద్ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..
ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో అఖిల్ మిశ్రా భార్య ‘సుస్సానే’ హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో ఆమె షాక్ కి గురైనట్లు, వెంటనే ముంబై బయలుదేరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించారు. కాగా అఖిల్ మిశ్రా.. హిందీ సూపర్ హిట్ మూవీ ‘3 ఇడియట్స్’ సినిమాలో లైబ్రేరియన్ రోల్ లో నటించిన అఖిల్ మిశ్రా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.