Akshay Oberoi : నా భార్య నాతో పడుకోడానికి భయపడింది.. నటుడి కామెంట్స్ వైరల్..
తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Akshay Oberoi)
Akshay Oberoi
Akshay Oberoi : కొంతమంది నటులు చేసిన పాత్రలను బట్టి రియల్ లైఫ్ లో కూడా వాళ్ళను అలానే చూస్తారు. ఇక విలన్ పాత్రలు చేసేవారికి బయట కూడా తిట్టడం, ఇంట్లో వాళ్ళు కూడా భయపడటం లాంటి సంఘటనలు గతంలోకి పలువురు నటులు తెలిపారు. తాజాగా అలాంటి సంఘటన బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
పిజ్జా, గుర్గాన్, ఫైటర్, ఇల్లీగల్, ఫ్లెష్, ఇన్సైడ్ ఎడ్జ్.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో అక్షయ్ బాలీవుడ్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. విలన్ పాత్రలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నాడు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Tanish : పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ.. ఒక సైనికుడి కొడుకుగా బాధపడుతున్నా.. తనీష్ వ్యాఖ్యలు..
అక్షయ్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ఫ్లెష్ సిరీస్ చూసిన తర్వాత నా భార్య నా పాత్రకు భయపడింది. ఆ సిరీస్ తర్వాత నా భార్య నాతో పడుకోడానికి కూడా ఒప్పుకోలేదు. నాతో బెడ్ పై పడుకోలేదు. తను వేరే గదిలోకి వెళ్లి పడుకునేది. తన భర్తలో ఇంత క్రూరత్వం ఉందా అని ఆమెని ఇబ్బందిపెట్టింది. ఇంతటి భయంకరమైన నటుడు ఉన్నాడా నీలో అని అడిగేది. పర్సనల్ గా అది నాకు ఇబ్బంది అనిపించినా ఒక నటుడిగా సంతోషం వేసింది. ఆ సిరీస్ తర్వాత నా భార్యకు దగ్గరవడానికి ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి చాలా కష్టపడ్డాను అని అన్నారు.
ఫ్లెష్ సిరీస్ లో అక్షయ్ ఓబెరాయ్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వ్యక్తిగా నెగిటివ్ షెడ్ లో క్రూరమైన, రాక్షసత్వంతో కూడిన పాత్రలో కనిపించారు.
