Tanish : పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ.. ఒక సైనికుడి కొడుకుగా బాధపడుతున్నా.. తనీష్ వ్యాఖ్యలు..
తాజాగా జనసేన పార్టీ ఢిల్లీలో నిర్వహించిన సేన ప్రస్థానం - దేశ సమైక్యత కోసం అనే కార్యక్రమంలో తనీష్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. (Tanish)
Tanish
Tanish : ఇటీవల పలువురు తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణకు రావద్దంటూ, ఇక్కడ పోటీ చేయొద్దంటూ పలువురు కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ సభకి కూడా అనుమతి ఇవ్వలేదు. వీటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నటుడు తనీష్ జనసేన తరపున తెలంగాణలో యాక్టివ్ గా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా జనసేన పార్టీ ఢిల్లీలో నిర్వహించిన సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం అనే కార్యక్రమంలో తనీష్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Pawan Kalyan: మహిళల కట్టుబొట్టుపై మాట్లాడతారా?.. మరీ ఇంతలా దిగజారాలా.. అమర్నాథ్ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం
తనీష్ మాట్లాడుతూ.. మా నాన్న ఒక సోల్జర్. దేశం కోసం పనిచేసారు. రాజస్థాన్, ఢిల్లీ, హైదరాబాద్ లో పనిచేసారు. నేను చిన్నప్పుడు ఆర్మీ సెక్టార్ లో పెరిగినప్పుడు ఈ కులం, మతం అని వచ్చేవి కావు. ఆయన పనిచేసేటప్పుడు ఏ రోజు కూడా ఏ ప్రాంతం కోసం నేను పనిచేస్తున్నాను, ఏ కులం కోసం పనిచేస్తున్నాను అని అనుకోలేదు. ఒక దేశం కోసం పనిచేస్తున్నాను అనే అనుకున్నారు.
ఈ రోజు నేను జనసేన తరపున తెలంగాణలో మాట్లాడుతుంటే వీడెక్కడ పుట్టాడు అని మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతంలో పుట్టాను అని అడిగే బాధ కంటే ఆ మాటలన్నీ ఒక సైనికుడి కొడుకుగా వింటుంటే బాధేస్తుంది. బోర్డర్ లో దేశం కోసం పోరాడే సైనికులు ఇలాంటి వార్తలు చూసి ఏం ఫీల్ అవుతారు అనేది ఒక్క పౌరుడు కూడా ఆలోచించట్లేదు. అది ఆలోచించాలి. దేశం కోసం ప్రతి రాష్ట్రం నుంచి కంట్రిబ్యూట్ చేయాల్సింది పోయి నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు, నీకేం హక్కు ఉందని మాట్లాడతావు అనడం కరెక్ట్ కాదు అని అన్నారు.
Also Read : Chandini Chowdary : సినిమాకు ఐదేళ్లు కష్టపడ్డా రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు.. చాందిని చౌదరి సంచలన వ్యాఖ్యలు..
View this post on Instagram
