Malaika Arora Father : బాలీవుడ్ లో విషాదం.. ఒకప్పటి హీరోయిన్ తండ్రి సూసైడ్..
బాలీవుడ్ భామ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా నేడు ఉదయం ఆత్మహత్య చేసుకొని మరణించారు.

Bollywood Actress Malaika Arora Father Anil Arora Passed Away
Malaika Arora Father : బాలీవుడ్ భామ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా నేడు ఉదయం ఆత్మహత్య చేసుకొని మరణించారు. దీంతో బాలీవుడ్ లో ఈ సూసైడ్ సంచలనం రేపింది. హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మలైకా అరోరా ప్రస్తుతం సినిమాలు, షోలతో బిజీగా ఉంది. మలైకా అతనికంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉంటూ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది.
Also Read : Darshan Wife : హత్య కేసులో జైల్లో హీరో.. బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్‌తో హీరో భార్య..
మలైకా తండ్రి అనిల్ అరోరా నేడు ఉదయం ముంబై బాంద్రాలోని తన ఇంటి టెర్రస్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో కారణాలు ఇంకా తెలీదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. దీనిపై మలైకా అరోరా స్పందించలేదు.
మలైకా తండ్రి అనిల్ అరోరా మరణంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఆమె ఇంటికి వెళ్లి అనిల్ అరోరాకు నివాళులు అర్పిస్తున్నారు.