Darshan Wife : హత్య కేసులో జైల్లో హీరో.. బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్‌తో హీరో భార్య..

తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి తన బెస్ట్ ఫ్రెండ్ శృతి రమేష్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది.

Darshan Wife : హత్య కేసులో జైల్లో హీరో.. బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్‌తో హీరో భార్య..

Darshan Wife Vijayalakshmi Participated in Friends Birthday Party Photos goes Viral

Updated On : September 11, 2024 / 7:42 AM IST

Darshan Wife : కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమానిని హత్య చేయించాడు అనే ఆరోపణలతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. దర్శన్ అరెస్ట్ అయి మూడు నెలలు అవుతుంది. ఈ కేసులో ఆధారాలు అన్ని దర్శన్ ఈ హత్య చేయించాడు అనే చెప్తున్నాయని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం కేసు విచారణ సాగుతుంది.

దర్శన్ అరెస్ట్ అయ్యాక ఆమె భార్య విజయలక్ష్మి తన భర్త గురించి తప్పుగా ప్రమోట్ చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. దర్శన్ అరెస్ట్ అయిన దగ్గర్నుంచి విజయలక్ష్మి ఎక్కువగా గుళ్ళు, గోపురాలు సందర్శిస్తుంది. అప్పుడప్పుడు తన భర్తను కలవడానికి జైలుకు వెళ్తుంది. అయితే తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి తన బెస్ట్ ఫ్రెండ్ శృతి రమేష్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది.

Also Read : Selena Gomez : నేను పిల్లల్ని కనలేను.. ఎమోషనల్ అయిన స్టార్ సింగర్..

బెంగుళూరులో జరిగిన శృతి రమేష్ పుట్టిన రోజు వేడుకలకు దర్శన్ భార్య విజయలక్ష్మి వెళ్లి అక్కడ పార్టీలో తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధింవిహీన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కోడలు స్మితా కూడా హాజరవడం గమనార్హం. స్మిత, విజయలక్ష్మి కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకి రాగా ఈ బర్త్ డే పార్టీ చర్చగా మారింది.

Darshan Wife Vijayalakshmi Participated in Friends Birthday Party Photos goes Viral