#VT13 Heroine : వరుణ్ తేజ్ కోసం రానున్న మాజీ ప్రపంచసుందరి.. VT13 షూట్ మొదలు..

వరుణ్ తేజ్ 13వ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ తో గని సినిమా నిర్మించిన రెనైసెన్స్ పిక్చర్స్ ఈ సినిమాని సోని పిక్చర్స్ తో కలిపి నిర్మిస్తుంది. ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమాలో................

#VT13 Heroine : వరుణ్ తేజ్ కోసం రానున్న మాజీ ప్రపంచసుందరి.. VT13 షూట్ మొదలు..

Bollywood actress miss world 2017 manushi chillar will be a part in Varun tej movie VT13

Updated On : March 3, 2023 / 2:00 PM IST

#VT13 Heroine :  మెగా హీరోల్లో కెరీర్ మొదటి నుంచి కూడా వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలని అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ గత సినిమా గని పరాజయం పాలైంది. ప్రస్తుతం వరుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే స్పై యాక్షన్ సినిమా చేస్తున్నాడు వరుణ్. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ 13వ సినిమాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుంది.

వరుణ్ తేజ్ 13వ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ తో గని సినిమా నిర్మించిన రెనైసెన్స్ పిక్చర్స్ ఈ సినిమాని సోని పిక్చర్స్ తో కలిపి నిర్మిస్తుంది. ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ నటించనున్నట్టు ప్రకటిస్తూ ఓ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. అలాగే సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్టు తెలిపారు.

Deepika Padukone : మొన్న కాన్స్.. నేడు ఆస్కార్.. ఆస్కార్ అవార్డు ప్రజెంటర్స్ లో దీపికా..

మానుషి చిల్లర్ 2017 లో మిస్ వరల్డ్ సాధించిన తర్వాత బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృద్విరాజ్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది. ప్రస్తుతం మానుషి చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలో భాగమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి, ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.