Bollywood Actress : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? గాడ్జిల్లా కథ కూడా ఉంది..!
ఈ ఫొటోలో కనబడుతున్న పాప మీలో చాలామంది ఫేవరెట్ హీరోయిన్. ఈ ఫోటో వెనుక ఒక గాడ్జిల్లా కథ కూడా ఉంది.

Bollywood Actress National Award winner childhood photo
Bollywood Actress : సిల్వర్ స్క్రీన్ పై తమ అందాలతో, అభిమానయంతో అభిమానుల మనసు దోచుకునే ముద్దుగుమ్మలు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. అలాగే సినిమాలోకి రాకముందు వాళ్ళు ఏం చేసేవారు..? అంతకుముందు ఎలా ఉండేవారు..? చిన్నప్పుడు ఎలా ఉండేవారు అనే విషయాలు పై కూడా ఎంతో క్యూరియాసిటీ చూపిస్తుంటారు. ఇక ఎప్పుడైనా తమ ఫేవరెట్ యాక్టర్ లేదా యాక్ట్రెస్ చిన్నప్పటి ఫోటో బయటకి వస్తే.. దానిని చూసి తెగ మురిసిపోతారు.
ఇప్పుడు పైన కనబడుతున్న ఫొటోలో ఉన్న పాప కూడా మీలో చాలామంది ఫేవరెట్ హీరోయిన్. ఆమె ఎవరు గుర్తు పట్టండి చూదాం. మీకు కష్టంగా ఉందంటే.. ఒక క్లూ కూడా తీసుకోండి. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్. తెలుగులో కూడా నటించింది. ఇటీవల నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. ఇంకా పెద్ద క్లూ కావాలంటే అంటే.. ఫొటోలో ఉన్న పాప సొట్టబుగ్గ (డింపుల్). అయినా గుర్తు పట్టలేకపోయారా..? ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ గంగూభాయ్, RRR హీరోయిన్ అలియా భట్.
నేడు అక్టోబర్ 25న అలియా వాళ్ళ అమ్మ పుట్టినరోజు కావడంతో.. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో అలియా చిన్నప్పటి బర్త్ డే ఫోటో అంట. ఆ బర్త్ డే పార్టీలో అలియా గాడ్జిల్లా ఫోటో చూసి బాగా బయపడింది అంట. దీంతో ఆ పార్టీ అంతా అమ్మ ఒడిలో నుండి కిందకి దిగలేదని అలియా ఇప్పుడు గుర్తుకు చేసింది. ఇక ఈ పోస్ట్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. ‘సో క్యూట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram