Allu Arjun – Sai Pallavi : అల్లు అర్జున్, సాయి పల్లవి పై రాప్ సాంగ్ విన్నారా.. బాలీవుడ్‌లో రీ సౌండ్ వస్తుంది..

బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక రాప్ సాంగ్ బాగా వైరల్ అవుతుంది. ఆ సాంగ్ లో అల్లు అర్జున్, సాయి పల్లవి క్రేజ్ గురించి..

Allu Arjun – Sai Pallavi : అల్లు అర్జున్, సాయి పల్లవి పై రాప్ సాంగ్ విన్నారా.. బాలీవుడ్‌లో రీ సౌండ్ వస్తుంది..

Kayden Sharma Street Celebrity with Allu Arjun Sai Pallavi lyrics

Updated On : October 25, 2023 / 3:44 PM IST

Allu Arjun – Sai Pallavi : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సౌత్ లోనే కాకుండా ఇండియా వైడ్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. సౌత్ టు నార్త్ ఎంతోమంది మూవీ మేకర్స్ వీరితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే, బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక రాప్ సాంగ్ బాగా వైరల్ అవుతుంది. ఆ సాంగ్ లో అల్లు అర్జున్, సాయి పల్లవితో హైదరాబాద్ నగరం గురించి కూడా ప్రస్తావిస్తూ రేపర్ కేదెన్‌శర్మ ఆడియన్స్ ని ఊర్రూతలూగించాడు.

హైదరాబాద్ రేపర్ అయిన కేదెన్‌శర్మ.. తాజాగా బాలీవుడ్ లోని ప్రముఖ టీవీ ఛానల్ మ్యూజిక్ షోలో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ సాంగ్ లో హైదరాబాద్ కల్చర్‌, సిటీ గొప్పతనాన్ని, ఇక్కడి వీధుల్లో చిరు వ్యాపారుల రోజువారీ జీవితాన్ని తెలియజేస్తూ పాటని మొదలు పెట్టాడు. పాట మధ్యలో మజా రావడం లేదా, ఇప్పుడు వస్తుంది చూడండి అంటూ.. ‘అల్లు అర్జున్ డాన్స్ అంటే అందరికి ఇష్టం, స్టైల్ స్టార్ అందరూ అతని, తగ్గేదేలే మేము పుష్ప ఫ్యాన్స్’ అనే లిరిక్స్ తో ఒక ఊపు ఊపేసాడు.

Also read : Anasuya : పవన్, కొడాలి ఫ్యాన్స్ వార్ మధ్యలో అనసూయ.. ఏమన్నదంటే..?

ఆ తరువాత సాయి పల్లవి గురించి పడుతూ.. “అందాలు ఆరబోసే హీరోయిన్స్ ఉంటారు, కానీ సాయి పల్లవి సింప్లిసిటీ, పాపులారిటీ ఎవరికి రాదు, తెలుగులో ఉన్నది 70 మిలియన్ జనాలు మాత్రమే కానీ ఆమె రౌడీ బేబీ సాంగ్ కి బిలియన్ వ్యూస్ వచ్చే క్రేజ్ ఆమెది” అంటూ అదరగొట్టేశాడు. అలాగే RRR, రామోజీ ఫిలిం సిటీ, సౌత్ సినిమాల గొప్పతనం గురించి చెప్పే ఆ లిరిక్స్ కి బాలీవుడ్ ఆడియన్స్, షో జడ్జిలు కూడా ఫిదా అయ్యిపోయారు. ప్రస్తుతం ఈ పాట బి-టౌన్ లో రీ సౌండ్ వస్తుంది. ఒకసారి మీరుకూడా ఆ పాటని వినేయండి.