Kiara Advani : పెళ్లి హంగామా ముగిసింది.. బ్యాక్ టు వర్క్ అంటూ కియారా స్పెషల్ సెల్ఫీ…
ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్న సిద్దార్థ్-కియారా ఆ తర్వాత ఢిల్లీలో కుటుంబ సభ్యుల కోసం ఒక రిసెప్షన్, ముంబైలో బాలీవుడ్ కోసం ఒక రిసెప్షన్ వేడుక చేసుకున్నారు. ఈ కొత్త జంట ఇన్ని రోజులు సరదాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు బ్యాక్ టు వర్క్ అవుతున్నారు. తాజాగా కియారా..........

Bollywood heroine Kiara Advani back to work after completing marriage with sidharth malhotra
Kiara Advani : బాలీవుడ్ లో ఇటీవల వరుస పెళ్లిళ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇదే క్రమంలో బాలీవుడ్ స్టార్ లవ్ కపుల్ సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ ఇటీవలే ఫిబ్రవరి 7న జైసల్మీర్ లో వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినా వీరు దానిపై స్పందించకుండా ఇటీవల సైలెంట్ గా పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్న సిద్దార్థ్-కియారా ఆ తర్వాత ఢిల్లీలో కుటుంబ సభ్యుల కోసం ఒక రిసెప్షన్, ముంబైలో బాలీవుడ్ కోసం ఒక రిసెప్షన్ వేడుక చేసుకున్నారు. ఈ కొత్త జంట ఇన్ని రోజులు సరదాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు బ్యాక్ టు వర్క్ అవుతున్నారు. తాజాగా కియారా బ్యాక్ టు వర్క్ అంటూ ఓ పోస్ట్ చేసింది. కియారా అద్వానీ ఇప్పుడు రామ్ చరణ్-శంకర్ సినిమాతో పాటు ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.
RRR Team at HCA Awards Event : హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్స్ అవార్డులు అందుకున్న RRR యూనిట్..
ప్రస్తుతం చరణ్ ఆస్కార్ హడావిడిలో అమెరికాలో ఉన్నాడు. దీంతో ఈ షూట్ కొన్ని రోజులు వాయిదా పడింది. అయితే ఇన్ని రోజులు పెళ్లి పనులతో హడావిడిగా ఉన్న కియారా తాజాగా బ్యాక్ టు వర్క్ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షూటింగ్ స్పాట్ లో మేకప్ వేసుకుంటూ ఓ మిర్రర్ సెల్ఫీ పోస్ట్ చేసింది. బాలీవుడ్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపొయింది కియారా. దీంతో అభిమానులు కొత్త జంట అప్పుడే వర్క్ కి వెళ్లిపోయారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సిద్దార్థ్ కూడా త్వరలో తన నెక్స్ట్ సినిమా షూట్ లో పాల్గొననున్నాడు. ఇక కియారా పెళ్లి తర్వాత కూడా ఇదివరకులానే నటిస్తాను అని గతంలోనే ప్రకటించింది.