Drishyam 3: దృశ్యం-3 పై ఆసక్తిని పెంచేస్తున్న బాలీవుడ్ మేకర్స్.. ఒకేసారి రెండు!
మలయాళంలో తెరకెక్కిన దృశ్యం, దృశ్యం-2 సినిమాలు ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. స్టార్ హీరో మోహన్ లాల్ పర్ఫార్మెన్స్‌కు అదిరిపోయే ట్విస్టులు తోడవడంతో, ఈ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయగా.. ఆయా భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే, బాలీవుడ్‌లో దృశ్యం సిరీస్‌కు బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది.

Bollywood Makers Planning For Drishyam 3 In Hindi And Malayalam
Drishyam 3: మలయాళంలో తెరకెక్కిన దృశ్యం, దృశ్యం-2 సినిమాలు ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. స్టార్ హీరో మోహన్ లాల్ పర్ఫార్మెన్స్‌కు అదిరిపోయే ట్విస్టులు తోడవడంతో, ఈ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయగా.. ఆయా భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే, బాలీవుడ్‌లో దృశ్యం సిరీస్‌కు బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది.
యాక్షన్ హీరో అజయ్ దేవ్గన్ లీడ్ రోల్‌లో చేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక దృశ్యం-2 సినిమా అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.350 కోట్ల మేర వసూళ్లు రాబట్టి తన సత్తా చాటింది. ఈ సినిమాలోని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు బాలీవుడ్ జనం ఈ సినిమాలకు కొనసాగింపు గురించి ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, గతంలో మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం-3 సినిమా ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో, ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది.
Drishyam 2: పాఠాలు నేర్పుతున్న దృశ్యం-2 సక్సెస్.. మనవాళ్లు తప్పు చేశారా?
అయితే, మలయాళంలో సినిమాను రూపొందించి, ఆ తరువాత హిందీలో రీమేక్ చేసే వరకు చాలా సమయం పడుతుందని భావించిన మేకర్స్.. ఈ సీక్వెల్ కొనసాగింపును ఒకేసారి మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించాలని చూస్తున్నారట. ఈమేరకు దర్శకుడు జీతూ జోసెఫ్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే, త్వరలోనే దృశ్యం-3 ఒకేసారి రెండు భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకోవడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.