Bellamkonda Suresh : ఛత్రపతి రీమేక్ సినిమా రషెస్ చూసి VV వినాయక్‌కి 500 కోట్ల భారీ సినిమా ఆఫర్ చేశారు..

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ''ఛత్రపతి రీమేక్ సినిమాను హిందీలో పెన్ స్టూడియోస్ సంస్థ భారీ స్థాయిలో విడుదల చేయబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రషెష్ చూసిన.............

Bellamkonda Suresh : ఛత్రపతి రీమేక్ సినిమా రషెస్ చూసి VV వినాయక్‌కి 500 కోట్ల భారీ సినిమా ఆఫర్ చేశారు..

Bollywood Pen Studios offers big Movie to VV Vinayak

Updated On : September 23, 2022 / 12:07 PM IST

Bellamkonda Suresh :  పక్కా మాస్, కమర్షియల్, బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ VV వినాయక్ ఇటీవల కొంచెం స్లో అయ్యాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు వినాయక్. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. అయితే బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ కూడా ఈ నిర్మాణంలో భాగమయినట్టు సమాచారం.

బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో VV వినాయక్ దర్శకత్వంలో గతంలో సినిమాలొచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో బాలకృష్ణ హీరోగా వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. త్వరలో ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటిస్తూ ఓ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు.

Taapsee Pannu : మాటిమాటికి మీడియా మీద ఫైర్ అవుతున్న తాప్సీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ”ఛత్రపతి రీమేక్ సినిమాను హిందీలో పెన్ స్టూడియోస్ సంస్థ భారీ స్థాయిలో విడుదల చేయబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రషెష్ చూసిన పెన్ స్టూడియోస్ వివి వినాయక్ సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేశారని ప్రశంసించారు. అంతేకాక వాళ్ళ సంస్థలో ఒక సినిమాని కూడా ఆఫర్ చేశారు. అది కూడా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని వినాయక్ కి ఆఫర్ చేశారు” అని తెలిపారు.

మరి ఇది నిజమేనా లేదా ఛత్రపతి రీమేక్ ప్రమోషన్స్ కి పనికొస్తుందని అలా చెప్పారా చూడాలి. నిజంగానే పెన్ స్టూడియోస్ సంస్థ VV వినాయక్ కి సినిమా ఆఫర్ చేసిందా లేదా తెలియాలంటే ఛత్రపతి రీమేక్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇటీవలే RRR సినిమాని బాలీవుడ్ లో విడుదల చేసింది పెన్ స్టూడియోస్ సంస్థ.