Actress Sridevi : చనిపోయిన ఐదేళ్లకు.. శ్రీదేవి చిరకాల కోరిక తీర్చిన భర్త బోనీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి (Sri Devi) గురించి చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 24 ఫిబ్రవరి 2018న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లినప్పటికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆమె ఇంకా జీవించే ఉంది.

Sridevi's Dream
Actress Sridevi’s Dream : అతిలోక సుందరి శ్రీదేవి (Sri Devi) గురించి చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 24 ఫిబ్రవరి 2018న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లినప్పటికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆమె ఇంకా జీవించే ఉంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించిన శ్రీదేవి దుబాయ్‌లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె చనిపోయి ఐదేళ్లు కావొస్తోంది. ఇన్నాళ్లకు ఆమె చిరకాల కోరికను భర్త బోనీకపూర్ (Boney Kapoor) తీర్చారు.
80వ దశకంలో హీరోయిన్‌గా కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో శ్రీదేవి చెన్నైకి సమీపంలోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో బీచ్ దగ్గర 5 ఎకరాలు కొనుగోలు చేసింది. ఇక్కడ తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఎంతో ఆశపడింది. అయితే.. ఆ కోరిక తీరకుండానే ఆమె అందరినీ విడిచివెళ్లిపోయింది. తన భార్య చిరకాల కోరికను భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఇన్నాళ్లకు నెరవేర్చారు.
Mahesh Babu : పోకిరి, బిజినెస్ మేన్ మాత్రమే కాదు.. ప్రతి సినిమా రీ రిలీజ్..
తాజ్ గ్రూప్ పార్ట్‌నర్‌షిప్‌లో హోటల్‌గా అభివృద్ధి చేశారు. “ఇది శ్రీదేవి కల. ఆమె డ్రీమ్‌ను నెరవేర్చేందుకు రెండేళ్లుగా డెవలప్‌మెంట్ పనులు చేపట్టి.. ఫైనల్‌గా బీచ్ హౌస్‌ను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది.” అని బోనీకపూర్ చెప్పారు. శ్రీదేవి డ్రీమ్ హౌస్ లొకేషన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Sridevi-Boney Kapoor
In the late 80’s during the peak of her career, Late #SriDevi bought a 5 acre beach facing property at Mahabalipuram East Coast Road near Chennai.
Five years after her demise, he husband, popular producer #BoneyKapoor developed the property as a hotel in partnership with the… pic.twitter.com/zQRupt7gmN
— BA Raju’s Team (@baraju_SuperHit) August 20, 2023
ఇదిలా ఉంటే.. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తల్లి బాటలోనే పయనిస్తోంది. శ్రీదేవి కూతురిగా పరిశ్రమలో అడుగుపెట్టిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీకపూర్ లుక్ వైరలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sunny Deol : అప్పు ఎగ్గొట్టిన బాలీవుడ్ హీరో.. విల్లా వేలానికి పెట్టిన బ్యాంక్
Boney Kapoor is happy to fulfilling Sri Devi’s dream. He says, “Fulfilling Sri’s dream, it’s been almost 2yrs since I started developing her beach house.”@BoneyKapoor pic.twitter.com/0d6ellj6wf
— BA Raju’s Team (@baraju_SuperHit) August 20, 2023