Bollywood : ఈ హీరో మామూలోడు కాదు.. ఏకంగా లవర్ కే ఇంటిని రెంట్ కి ఇచ్చి.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?
ఈ బాలీవుడ్ హీరో ఏకంగా తన లవర్ కే రెంట్ కి ఇవ్వడం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా?(Bollywood)

Bollywood
Bollywood : సెలబ్రిటీలు తమకున్న ప్రాపర్టీలలో చాలా వరకు తెలిసిన వాళ్లకు లేదా సెలబ్రిటీలకు రెంట్ కి ఇస్తూ ఉంటారు. బాలీవుడ్ లో అయితే ఇది మరీ ఎక్కువ. బాలీవుడ్ స్టార్స్ బయట వాళ్లకు వాళ్ళ ప్రాపర్టీలను రెంట్ కి అంత తొందరగా ఇవ్వరు. చాలా మంది నటీనటులు వేరే నటీనటులకు తమ ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లను రెంట్ కి ఇచ్చిన వార్తలు గతంలో విన్నాము. కానీ ఈ హీరో ఏకంగా తన లవర్ కే రెంట్ కి ఇవ్వడం వైరల్ గా మారింది.(Bollywood)
ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఇటీవలే హృతిక్ వార్ 2 సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్ కి గతంలో విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హృతిక్ రోషన్ సబా ఆజాద్ అనే నటితో ప్రేమలో ఉండి డేటింగ్ చేస్తున్నాడు. వీరి ప్రేమ అందరికి తెలుసు. రెగ్యులర్ గా వీరిద్దరూ కలిసి ఫొటోలు కూడా షేర్ చేస్తారు.
Also Read : OG Song : పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసింది.. మంచి మెలోడీ పాట..
తాజాగా బాలీవుడ్ సమాచారం ప్రకారం హృతిక్ రోషన్ ముంబై జుహులో సముద్రం ఫేసింగ్ లో ఉన్న తన లగ్జరీ అపార్ట్మెంట్ ని తన లవర్ సబా ఆజాద్ కి రెంట్ కి ఇచ్చాడట. నెలకు 75 వేల రూపాయలకు రెంట్ కి ఇచ్చాడట. సబా అది తన ఆఫీస్ పర్పస్ కి వాడుకుంటుంది అని సమాచారం. దీంతో ఈ వార్త వైరల్ గా మారగా లవర్ కి రెంట్ కి ఇచ్చాడంటే హృతిక్ మామూలోడు కాదు, ప్రేమ వేరు బిజినెస్ వేరు అని డైరెక్ట్ గానే అందరికి క్లారిటీ ఇచ్చాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Sundarakanda : ‘సుందరకాండ’ మూవీ రివ్యూ.. బాబోయ్ ట్విస్ట్, లవ్ స్టోరీ మాములుగా లేదుగా..