Boney Kapoor Clarity Of Love Today Hindi Remake Rights
Boney Kapoor: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ హిందీతో పాటు దక్షిణాదిన పలు భాషల్లో సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ మంచి సక్సెస్‌ను అందుకుంటున్నారు. తాజాగా ఆయన తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ‘తునివు’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేయగా, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
ఇక ఇదిలా ఉండగా, నిర్మాత బోనీ కపూర్ త్వరలోనే మరో చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన ‘లవ్ టుడే’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా ఈ సినిమాకు అదిరిపోయే విజయాన్ని అందించారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను నిర్మాత బోనీ కపూర్ దక్కించుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తుల చక్కర్లు కొట్టాయి.
Love Today : ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ లవ్ టుడే..
అయితే ఈ విషయంపై నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. తాను లవ్ టుడే చిత్రానికి సంబంధించి ఎలాంటి రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకోలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలన్నీ కూడా అవాస్తవం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా తమిళ, తెలుగు భాషల్లో సక్సెస్ అయిన లవ్ టుడే చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్‌ను తాను సొంతం చేసుకోలేదని బోనీ కపూర్ స్వయంగా చెప్పడంతో, ఈ సినిమా హిందీ రీమేక్ ఆయన చేయడం లేదని తేలిపోయింది.
Please note that I have NOT acquired the remake rights of Love Today. All such reports on social media are baseless and fake.
— Boney Kapoor (@BoneyKapoor) January 2, 2023