Boney Kapoor : బోనీ కపూర్ వ్యాఖ్యలు వైరల్.. శ్రీదేవితో నా పెళ్లికి ముందే జాన్వీ కపూర్..?
తెలుగు వారికి అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న శ్రీదేవి దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.

Sridevi-Boney Kapoor-Janhvi Kapoor
Boney Kapoor-Sridevi : తెలుగు వారికి అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న శ్రీదేవి దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే.. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో 2018లో ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి మరణించింది. శ్రీదేవి మరణం పై అలాగే పెళ్లికి ముందే జాన్వీకపూర్ పుట్టారనే రూమర్లపై బోనీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
1996లో శ్రీదేవి, తాను షిర్డిలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు బోనీ కపూర్ చెప్పారు. కొద్ది నెలల తరువాత ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలిపారు. ఆ తరువాత 1997లో జనవరిలో మరోసారి అందరి సమక్షంలో వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. ‘ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించాం. 1997 మార్చిలో మాకు జాన్వీకపూర్ జన్మించింది. అయితే.. కొన్ని మీడియాల్లో పెళ్లికి ముందే పుట్టిందనే రూమర్లు వచ్చాయి. ఎన్ని సార్లు జాన్వీకపూర్ పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చినప్పటికీ రూమర్లు ఆడగం లేదు.’ అని బోనీ కపూర్ అన్నారు.
శ్రీదేవికి దైవ భక్తి ఎక్కువ..
శ్రీదేవికి దైవ భక్తి ఎక్కువని చెప్పారు. తన ప్రతి పుట్టిన రోజున తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకునేదన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆమె జుహు నుండి సిద్ధి వినాయక్ వరకు చెప్పులు లేకుండా నడిచేదని బోనీ కపూర్ తెలిపారు. ప్రస్తుతం జాన్వీకపూర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరుమలకు వెళ్లి వస్తుందని చెప్పారు.
Mounika Reddy : అవును వాళ్లిద్దరూ.. విడాకుల వార్తలు పై మౌనిక రెడ్డి కామెంట్స్..
Sridevi Family
శ్రీదేవి మరణం పై..
శ్రీదేవి మరణంపై కూడా బోనీ కపూర్ స్పందించారు. శ్రీదేవిది సహజ మరణం కాదని, ప్రమాదవశాత్తు జరిగిందన్నారు. ఆమె స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యేది. ఉప్పు లేకుండా భోజనం చేసేది. దీంతో కొన్ని సార్లు లోబీపీతో కిందపడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంపై డాక్టర్లు హెచ్చరించారు. అయినప్పటికీ ఆహారంలో ఉప్పు తీసుకునేది కాదు. ఆమె మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని పోలీసులు నిర్థారించినట్లు తెలిపారు.
Ram Charan : కొత్త స్నేహితుడిని పరిచయం చేసిన రామ్ చరణ్.. ఎవరో తెలుసా..?
ఇదిలా ఉంటే.. శ్రీదేవి, బోనీకపూర్‌కు ఇద్దరు కూతుర్లు. పెద్ద జాన్వీకపూర్ కాగా, చిన్నమ్మాయి ఖుషి కపూర్. జాన్వీ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంతోనే జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.