Boyapati Sreenu : ఎన్నికల ఫలితాల వేళ.. చంద్రబాబుని కలవడానికి వెళ్లిన బోయపాటి.. మీడియాకు అభివాదం చేస్తూ..
తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబు నాయిడుని కలవడానికి వెళ్లారు.

Boyapati Sreenu went to meet for Chandrababu
Boyapati Sreenu : దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా నడుస్తుంది. ఇప్పటికే చాలా స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఏపీలో కూటమి అధికారం దిశగా దూసుకెళ్తుండటంతో సినీ ప్రముఖులు ఇప్పటికే సోషల్ మీడియాలో కూటమికి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలుపుతూ పోస్టులు వేస్తున్నారు.
Also Read : Ambati Rayudu : ఎన్నికల ఫలితాలపై అంబటి రాయుడు ట్వీట్.. ఏపీకి మంచి రోజులు వచ్చాయ్..
తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబు నాయిడుని కలవడానికి వెళ్లారు. అమరావతిలోని కరకట్ట రోడ్ లో ఉన్న చంద్రబాబు నివాసానికి బోయపాటి శ్రీను వెళ్లారు. చంద్రబాబు ఇంటికి వెళ్లే ముందు చెక్ పోస్ట్ వద్ద మీడియాకు అభివాదం చేశారు బోయపాటి. దీంతో ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. బోయపాటి శ్రీను చంద్రబాబు నాయుడుకు చాలా క్లోజ్ అని అందరికి తెలిసిందే. అలాగే చంద్రబాబు ప్రమాణస్వీకారం బాధ్యతలు బోయపాటికి అప్పచెప్తారని వార్తలు వస్తున్నాయి.