Deepika Rangaraju : ప్లీజ్ నన్ను బిగ్ బాస్ కి పిలవండి.. నేను వస్తాను.. బ్రహ్మముడి సీరియల్ దీపికకు ఛాన్స్ ఇస్తారా?

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక బిగ్ బాస్ గురించి మాట్లాడింది.

Deepika Rangaraju : ప్లీజ్ నన్ను బిగ్ బాస్ కి పిలవండి.. నేను వస్తాను.. బ్రహ్మముడి సీరియల్ దీపికకు ఛాన్స్ ఇస్తారా?

Deepika Rangaraju

Updated On : July 13, 2025 / 3:17 PM IST

Deepika Rangaraju : బిగ్ బాస్ ప్రతి సీజన్ లోను సీరియల్ నటీనటులు కూడా ఉంటారని తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ కి వెళ్లాలని, మరింత ఫేమ్ తెచ్చుకోవాలని అనుకుంటారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా బయట జనాల్లో ఫేమ్ ఉన్నవాళ్ళని కొంతమందిని తెస్తారు. కానీ ఈ నటిని పిలవట్లేదంట.

బ్రహ్మముడి సీరియల్ తో తెలుగులో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది తమిళ భామ దీపిక రంగరాజు. బ్రహ్మముడి సీరియల్ తో పాటు పలు టీవీ షోలు చేస్తూ తన అల్లరితో ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక బిగ్ బాస్ గురించి మాట్లాడింది.

Also Read : Shankar : గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత శంకర్ వెయ్యి కోట్ల సినిమా.. నిర్మాతలు దొరికేసారు.. యోధుడి కథతో హిట్ కొడతాడా?

దీపికా రంగరాజు బిగ్ బాస్ ఛాన్స్ గురించి మాట్లాడుతూ.. చాలా మంది నన్ను అడుగుతున్నారు బిగ్ బాస్ కి వెళ్తారా అని. ప్రస్తుతం అయితే బ్రహ్మముడి సీరియల్ ఉంది కాబట్టి వెళ్ళను. ఆ సీరియల్ అయ్యాకే వెళ్తాను. నాకు ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి కాల్ రాలేదు, వస్తే కచ్చితంగా వెళ్తాను. నాకు అయితే బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్, వెళ్లాలని కూడా ఉంది. నన్ను పిలవాలి అని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ కి వెళ్తే విన్నర్ టైటిల్ గెలవాలి. నాగార్జున గారు నా చేతిని పైకెత్తి విన్నర్ అని చెప్పాలి అని తెలిపింది.

దీంతో త్వరలో రాబోయే బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే దీపిక ఉండదు అని తెలుస్తుంది. మరి రాబోయే సీజన్స్ లో దీపికని బిగ్ బాస్ నిర్వాహకులు పిలుస్తారేమో చూడాలి.

Also Read : Kota Srinivasa Rao : అన్నయ్యతో మొదటి సినిమా.. తమ్ముడితో చివరి సినిమా.. కోట శ్రీనివాసరావు చివరి సినిమా త్వరలో..