Lok Sabha elections 2024: ఓటు వేశాక.. జోక్ వేసిన బ్రహ్మానందం.. వీడియో ఇదిగో

టాలీవుడ్ నటులు క్యూలైన్లలో నిలబడి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Lok Sabha elections 2024: ఓటు వేశాక.. జోక్ వేసిన బ్రహ్మానందం.. వీడియో ఇదిగో

Updated On : May 13, 2024 / 4:32 PM IST

తెలుగు రాష్ట్రాల్లో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీనటుడు బ్రహ్మానందం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జోక్ వేశారు.

హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని బ్రహ్మానందాన్ని ఓ విలేకరి ప్రశ్నించారు. బ్రహ్మానందం జవాబుగా.. దానికి తానేం చేయాలంటూ జోక్ వేశారు. కాగా, పోలింగ్ జరుగుతోన్న వేళ ఓటర్లకు ఏం చెబుతారన్న ప్రశ్నకు బ్రహ్మానందం సమాధానం చెబుతూ ఓటర్లకు చెప్పేది ఏముంటుందని గంటలో మొత్తం అయిపోతుందని చెప్పారు.

ఓటు హక్కును అందరూ బాధ్యతగా భావించి వినియోగించుకోవాలని అన్నారు. కాగా, టాలీవుడ్ నటులు క్యూలైన్లలో నిలబడి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ ఓటు వేయాలని సందేశం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఇతర భాషల సినీనటులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Also Read: తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ సమయం