తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ సమయం
Voting ends: ఈ నియోజకవర్గాల్లో 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది...

Voting
తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. 5 లోక్‌సభ స్థానాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 గంటల వరకే ఈసీ పోలింగ్ గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఆదిలాబాద్ పార్లమెంట్ లోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి, మహబూబ్ బాద్ పార్లమెంట్ పరిధిలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కొత్తగూడెం, అశ్వారావుపేట లో పోలింగ్ సమయం ముగిసింది. అప్పటికే క్యూలైన్లలో నిల్చుని ఉన్న వారికి ఓటేవేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు. మిగిలిన 106 స్థానాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఈ నియోజకవర్గాల్లో 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
- సిర్పూర్ – 61.16, ఆసిఫాబాద్:- 65.5
- చెన్నూర్:- 58.65
- బెల్లంపల్లి :- 63
- మంచిర్యాల:- 52.97
- మంథని:- 56.2
- భూపాలపల్లి:- 58
- ములుగు:- 61.23
- పినపాక:- 60.68
- ఇల్లందు:- 61.86
- భద్రాచలం:- 60.58
- కొత్తగూడెం:- 60.92
- అశ్వరావుపేట:-68.88
Also Read : ఏపీలో పోలింగ్.. పలు జిల్లాల్లో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు!