Brahmanandam : ఆ ఒక్క సీన్ కోసం ముందు రోజంతా ఏమి తినకుండా ఉన్న బ్రహ్మానందం.. ఈ ఏజ్ లో కూడా ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్..

ఆ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తాజాగా మీడియా ఈవెంట్లో తెలిపాడు.

Brahmanandam : ఆ ఒక్క సీన్ కోసం ముందు రోజంతా ఏమి తినకుండా ఉన్న బ్రహ్మానందం.. ఈ ఏజ్ లో కూడా ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్..

Brahmanandam Didn't Eat whole day for One Scene in Rangamarthanda Movie

Updated On : February 16, 2025 / 5:42 PM IST

Brahmanandam : బ్రహ్మానందం.. ఈ పేరు చెప్తేనే మన ముఖంపై చిరునవ్వు వస్తుంది. వెయ్యికి పైగా సినిమాలతో నవ్వించడమే కాక అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో తన నటనతో ఏడిపించారు కూడా బ్రహ్మానందం. అలాంటి సినిమాలో రంగమార్తాండ ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ మరాఠి సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం యాక్టింగ్ కి ఎవ్వరైనా ఏడ్వాల్సిందే. ఆ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తాజాగా మీడియా ఈవెంట్లో తెలిపాడు.

Also Read : Vicky Kaushal : సినిమా కోసం ఇసుక అక్రమ తవ్వకాలు రియల్ గా షూట్ చేద్దామని వెళ్లి.. 500 మందికి చిక్కిన హీరో..

రాజా గౌతమ్ మాట్లాడుతూ.. ఆయన నాకు నటుడిగా కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే రంగమార్తాండ సినిమాలో ఒక సీన్ లో భార్య చనిపోతే ఏడ్చే సీన్ ఉంటుంది. ఆ సీన్ షూటింగ్ ముందు రోజు ఇంట్లో తినడానికి నాన్న రాలేదు. అమ్మని అడిగితే ఏమో తినను అన్నారు అని చెప్పింది. నేను వెళ్లి ఎందుకు తినట్లేదు అని అడిగితే.. రేపు షూటింగ్ లో ఒక సీన్ ఉంది. ఆ సీన్ లో చాలా వీక్ గా కనపడాలి. ఇవాళ అంతా తినకపోతే రేపు ఆ నీరసం ఫేస్ లో కనిపిస్తే ఆ సీన్ ఇంకా ఎలివేట్ అవుతుంది కదా అని చెప్పారు. ఆయన ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఏజ్ లో కూడా ఆయన యాక్టింగ్ కోసం అంత కష్టపడుతున్నారు అని తెలిపారు.

Also Read : Rakshita – Puri : చాన్నాళ్లకు పూరితో ‘ఇడియట్’ హీరోయిన్.. ఎలా అయిపోయిందో చూడండి.. మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా?

దీంతో ఈ ఏజ్ లో కూడా ఒక సీన్ ని పండించడానికి ఒక రోజంతా ఏం తినకుండా ఉన్నారు అంటే నటన మీద, సినిమా మీద ఆయనకు ఉన్న డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని మరోసారి బ్రహ్మానందంను అభినందిస్తున్నారు. ఇక బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమాతో ఇటీవల ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ ఎమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. దీనికి సంబంధించిన సక్సెస్ మీట్ లోనే రాజా గౌతమ్ తన తండ్రి బ్రహ్మానందం గురించి ఈ విషయం తెలిపారు. బ్రహ్మానందం ప్రస్తుతం గతంలో లాగా వరుసగా సినిమాలు చేయకుండా చాలా సెలెక్టివ్ గా అడపాదడపా మాత్రమే చిన్న పాత్రలతోనే సినిమాలు చేస్తున్నారు.