Vicky Kaushal : సినిమా కోసం ఇసుక అక్రమ తవ్వకాలు రియల్ గా షూట్ చేద్దామని వెళ్లి.. 500 మందికి చిక్కిన హీరో..

గతంలో చాలా సినిమా యూనిట్స్ రియల్ లొకేషన్స్ కి వెళ్లి ఇబ్బందులు పడ్డ ఘటనలు ఉన్నాయి.

Vicky Kaushal : సినిమా కోసం ఇసుక అక్రమ తవ్వకాలు రియల్ గా షూట్ చేద్దామని వెళ్లి.. 500 మందికి చిక్కిన హీరో..

Bollywood STar Vicky Kaushal went to Sand Mafia Place for Shoot

Updated On : February 16, 2025 / 5:01 PM IST

Vicky Kaushal : కొంతమంది డైరెక్టర్స్ సినిమాలో సీన్స్ న్యాచురల్ గా రావడానికి రియల్ లొకేషన్స్ కి వెళ్లి షూట్ చేస్తారు. అలాంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. గతంలో చాలా సినిమా యూనిట్స్ రియల్ లొకేషన్స్ కి వెళ్లి ఇబ్బందులు పడ్డ ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు.

బాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ కొడుకుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు విక్కీ కౌశల్. క్యారెక్టర్స్, చిన్న సినిమాల్లో హీరోగా చేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఫిబ్రవరి 14న విక్కీ కౌశల్, రష్మిక కలిసి జంటగా నటించిన చావా సినిమా రిలీజయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్ ఓ సంఘటన పంచుకున్నాడు.

Also Read : Film Industry Losses : ఎటు చూసినా భారీ నష్టాలే.. ఏ సినీ పరిశ్రమ చూసినా కష్టాలే.. 2024లో భారీ నష్టాలూ చూసిన సినీ పరిశ్రమ..

విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. నేను నటుడు అవ్వకముందు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వస్ఫూర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. ఆ సినిమాలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన సీన్ ఉంది. ఆ సీన్ కోసం కొన్ని షాట్స్ తీయడానికి రియల్ గా ఇసుక అక్రమ తవ్వకాలు చేసే చోటుకు వెళ్ళాం. అక్కడ పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయాను. చాలా మంది ఇసుక స్మగ్లర్లు ఉన్నారు. వాళ్ళు ఇసుకను అక్రమంగా తరలిస్తుండటం నేను, కెమెరామెన్ రహస్యంగా షూట్ చేసాం. అనుకోకుండా మేము షూట్ చేస్తుంటే వాళ్లకు దొరికిపోయాం. 500 మంది మమ్మల్ని చుట్టుముట్టారు. ఆ ముఠాకు చెందిన వ్యక్తి మా కెమెరామెన్ ని కొట్టి కెమెరా లాక్కున్నాడు. వాళ్ళు మాపై దాడి చేయబోతుంటే ఎలాగోలా మేము పారిపోయి వచ్చేసాం. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికి భయం వేస్తుంది అని తెలిపారు.

Also Read : Rakshita – Puri : చాన్నాళ్లకు పూరితో ‘ఇడియట్’ హీరోయిన్.. ఎలా అయిపోయిందో చూడండి.. మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా?

అలా రియల్ గా అక్రమ ఇసుక తవ్వకాలు షూట్ చేయడానికి వెళ్లి కష్టపడి తప్పించుకొని బయటపడ్డాడు విక్కీ కౌశల్. ప్రస్తుతం విక్కీ వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా చావా సినిమాని తెరకెక్కించారు. ఇందులో విక్కీ శంభాజీ మహారాజ్ గా అద్భుతమైన ప్రఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది.