Brahmanandam Daughter in Law : బ్రహ్మానందం రెండో తనయుడి పెళ్లి.. కోడలు ఎవరు? ఏం చేస్తుందో తెలుసా?

బ్రహ్మానందం ఇంటికి రెండో కోడలిగా వెళ్లిన ఈ అమ్మాయి ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. బ్రహ్మానందం రెండో కోడలి పేరు ఐశ్వర్య.

Brahmanandam Daughter in Law : బ్రహ్మానందం రెండో తనయుడి పెళ్లి.. కోడలు ఎవరు? ఏం చేస్తుందో తెలుసా?

Brahmanandam Second Daughter in Law Aishwarya Details

Updated On : August 19, 2023 / 3:50 PM IST

Brahmanandam Daughter in Law : హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్.. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం. అయన ఫేస్ చూస్తే చాలు ఎవరైనా నవ్వాల్సిందే. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఎప్పుడో ఒకటి నటిస్తున్నారు. ఇక బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్ సినిమాల్లో నటిస్తున్నారు. ద్వితీయ కుమారుడు సిద్ధార్థ అమెరికాలో జాబ్ చేస్తున్నారు.

ఇటీవల కొన్ని రోజుల క్రితం బ్రహ్మానందం రెండో తనయుడు సిద్ధార్థ నిశ్చితార్థం ఐశ్వర్య అనే అమ్మాయితో జరిగింది. తాజాగా సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం ఆగస్టు 18 రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.

Brahmanandam Second son Wedding : బ్రహ్మానందం రెండో తనయుడి పెళ్లి వేడుకలు.. హాజరైన సెలబ్రిటీలు ఫొటోలు..

దీంతో బ్రహ్మానందం ఇంటికి రెండో కోడలిగా వెళ్లిన ఈ అమ్మాయి ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. బ్రహ్మానందం రెండో కోడలి పేరు ఐశ్వర్య. హైదరాబాద్ లోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్, ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌ పద్మజ వినయ్‌ కూతురు ఈమె. బూర వినయ్ – పద్మజల కూతురు ఐశ్వర్య. ఈమె కూడా డాక్టర్ చదివింది. ప్రస్తుతం డాక్టర్ గా కూడా పనిచేస్తుంది. బ్రహ్మానందం ఇంటికి డాక్టర్ కోడలిగా వచ్చింది. ఇక కొడుకు సిద్దార్థ విదేశాల్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఈ కొత్త జంట విదేశాలకు వెళ్తుందా లేక ఇక్కడే సెటిల్ అవుతారా చూడాలి.