Brahmanandam : బ్రహ్మానందం రెండో తనయుడి నిశ్చితార్థం.. హాజరైన సినీ ప్రముఖులు..

బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్ హీరోగా పలు సినిమాలు చేశాడు. త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా ఆదివారం నాడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్దార్థ్ నిశ్చితార్థం జరిగింది.

Brahmanandam : బ్రహ్మానందం రెండో తనయుడి నిశ్చితార్థం.. హాజరైన సినీ ప్రముఖులు..

Brahmanandam second son Engagement happened on Sunday

Updated On : May 22, 2023 / 1:50 PM IST

Siddarth : హాస్య బ్రహ్మ, తెలుగు టాప్ కమెడియన్ బ్రహ్మానందం(Brahmanandam) ఇన్నాళ్లు మనల్ని తన సినిమాలతో నవ్వించారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ అడపాదడపా ఒకటో రెండో సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు హాస్యనటుడిగా జనాల్ని మెప్పించి ప్రస్తుతం ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నారు. బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు.

బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్ హీరోగా పలు సినిమాలు చేశాడు. త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా ఆదివారం నాడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్దార్థ్ నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో సిద్దార్థ నిశ్చితార్థ వేడుక జరగగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Brahmanandam second son Engagement happened on Sunday

Ram Charan : G20 సదస్సులో పాల్గొనబోతున్న రామ్ చరణ్.. శ్రీనగర్‌కు ప్రయాణం

హైదరాబాద్ కి చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యతో బ్రహ్మానందం తనయుడు సిద్దార్థ్ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నిశ్చితార్థానికి కొద్దిమంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్టు సమాచారం. పెళ్లిని త్వరలోనే ఘనంగా చేయనున్నారు. దీంతో సిద్దార్థ్ – ఐశ్వర్య నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Brahmanandam second son Engagement happened on Sunday