Ram Charan : G20 సదస్సులో పాల్గొనబోతున్న రామ్ చరణ్.. శ్రీనగర్‌కు ప్రయాణం

G20 సదస్సులో ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఏర్పాటైన 17 దేశాల సభ్యులు ఉన్న ప్యానెల్ లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు.

Ram Charan : G20 సదస్సులో పాల్గొనబోతున్న రామ్ చరణ్.. శ్రీనగర్‌కు ప్రయాణం

Ram Charan Participating in G 20 Summit 2023

G20 Summit : G20 సదస్సు 2023 జమ్మూ కశ్మీర్ – శ్రీనగర్(Srinagar) లో నేటి నుంచి జరగనుంది. జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగే మొదటి అంతర్జాతీయ కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమానికి G20 సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. దీంతో శ్రీనగర్ లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఫిలిం టూరిజం, ఫిలిం పాలసీల గురించి కూడా ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.

G20 సదస్సులో ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఏర్పాటైన 17 దేశాల సభ్యులు ఉన్న ప్యానెల్ లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఈ ప్యానెల్ నిర్వహించే సమావేశాల్లో చరణ్ ఇండియా తరపున పాల్గొనబోతున్నారు. ఇండియాలో ఫిలిం టూరిజం అభివృద్ధిపై చరణ్ మాట్లాడనున్నారు. కశ్మీర్ ని ఫిలిం టూరిజంలో భాగంగా ప్రమోట్ చేయనున్నారు చరణ్. దీంతో నేడు ఉదయం చరణ్ హైదరాబాద్ నుంచి శ్రీనగర్ కు వెళ్లారు.

RGV : ది కేరళ స్టోరీ వర్సెస్ బాలీవుడ్.. ఆర్జీవీ వరుస ట్వీట్స్..

మూడు రోజుల పాటు రామ్ చరణ్ శ్రీనగర్ లోనే ఉండి G20 సదస్సులో పాల్గొననున్నాడు. మూడు రోజుల ఈ సదస్సు అనంతరం చివరి రోజున వివిధ దేశాల నుంచి వచ్చిన అతిధులందరూ శ్రీనగర్ అందాలను తిలకించనున్నారు. అయితే ఇంత ప్రతిష్టాత్మక సదస్సులో రామ్ చరణ్ పాల్గొనబోతుండటంతో అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ చరణ్ ని అభినందిస్తున్నారు.