Chitti Potti : అన్నాచెల్లెళ్ల బంధంపై సినిమా.. ‘చిట్టిపొట్టి’ అంటూ..

తాజాగా అన్నాచెల్లెళ్ల ఎమోషన్ తో సరికొత్త సినిమా రాబోతుంది

Chitti Potti : అన్నాచెల్లెళ్ల బంధంపై సినిమా.. ‘చిట్టిపొట్టి’ అంటూ..

Brother and Sister Emotional Movie Chitti Potti Motion Poster Announced

Updated On : May 11, 2024 / 3:30 PM IST

Chitti Potti : గతంలో అన్నాచెల్లెళ్ల బంధంపై అనేక సినిమాలు వచ్చాయి. తాజాగా ఆ ఎమోషన్ తో సరికొత్త సినిమా రాబోతుంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా ‘చిట్టి పొట్టి’. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిట్టి పొట్టి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Allu Arjun : నాకు పార్టీలతో సంబంధం లేదు.. శిల్పా రవి కోసమే వచ్చాను.. ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్..

తాజాగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే చెల్లి పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళేటప్పుడు అన్నయ్య, కుటుంబం బాధపడుతున్నట్టు ఉంది. అన్నా చెల్లెలి అనుబంధం కథతో నడిచే ఈ సినిమాలో ఆడపిల్లకి పుట్టింటి పైన ఉన్న ప్రేమని తెలిపే ఎమోషన్ చూపెట్టనున్నారు. అన్నాచెల్లెళ్ల ఎమోషన్ తో తెరకెక్కుతున్న ఈ ‘చిట్టి పొట్టి’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.