Bunty Aur Babli 2 : ఈ ‘బంటీ – బబ్లీ’ ఎవరబ్బా?

‘బంటీ ఔర్ బబ్లీ 2’ ట్రైలర్ హిలేరియస్‌గా ఆకట్టుకుంటోంది..

Bunty Aur Babli 2 : ఈ ‘బంటీ – బబ్లీ’ ఎవరబ్బా?

Bunty Aur Babli 2

Updated On : October 26, 2021 / 5:25 PM IST

Bunty Aur Babli 2: సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్‌లో కొత్త సినిమాల రిలీజుల హంగామా స్టార్ట్ అయ్యింది. 2005లో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించగా సూపర్ హిట్ అయిన ‘బంటీ ఔర్ బబ్లీ’ కి సీక్వెల్‌గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ (Bunty Aur Babli 2) రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi Fan : దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు..

సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ జంటగా నటించగా వరుణ్ వి.శర్మ డైరెక్ట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సీక్వెల్‌లో సైఫ్, రాణీలతో పాటు మరో యువ జంట సిద్ధాంత్ చతుర్వేది, షర్వారీ కూడా నటించారు.

OMG 2 : సీక్వెల్ షూటింగ్ స్టార్ట్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్స్..

ఇటీవల వదిలిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇంతలో ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా మంచి ఎంటర్‌టైనర్ కానుందనే సంగతి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సీక్వెల్‌లో సీనియర్ ‘బంటీ – బబ్లీ’ తో పాటు యంగ్ ‘బంటీ – బబ్లీ’ జంట కూడా అదిరిపోయేలా వినోదాన్ని పంచబోతున్నారని హింట్ ఇచ్చారు మేకర్స్. కామెడీ టైమింగ్, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. నవంబర్ 19న ‘బంటీ ఔర్ బబ్లీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.