బైపాస్ రోడ్ – ఫస్ట్‌లుక్
ప్రముఖ బాలీవుడ్ నటుడు.. నీల్ నితిన్ ముఖేష్ హీరోగా నటిస్తూ, స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ‘బైపాస్ రోడ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్..

ప్రముఖ బాలీవుడ్ నటుడు.. నీల్ నితిన్ ముఖేష్ హీరోగా నటిస్తూ, స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ‘బైపాస్ రోడ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్..
ప్రముఖ బాలీవుడ్ నటుడు.. హిందీతో పాటు, తెలుగు, తమిళ్ సినిమాలతోనూ గుర్తింపు తెచ్చుకున్న నీల్ నితిన్ ముఖేష్ హీరోగా నటిస్తూ, స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తూ.. ‘బైపాస్ రోడ్’ అనే థ్రిల్లర్ డ్రామాను రూపొందిస్తున్నాడు. అదా శర్మ కథానాయికగా నటించింది.
నీల్ నితిన్ ముఖేష్ సోదరుడు నమాన్ నితిన్ ముఖేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ‘బైపాస్ రోడ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. నీల్ నితిన్ వీల్ చైర్‌లో కూర్చుని ఉన్నాడు ఈ పోస్టర్‌లో.. సెప్టెంబర్ 30న ట్రైలర్ విడుదల కానుంది. నవంబర్ 1 బైపాస్ రోడ్ మూవీ రిలీజ్ కానుంది. మిస్టరీ, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆడియన్స్‌ను షాక్‌కి గురిచేసే అంశాలు చాలా ఉన్నాయని మూవీ యూనిట్ తెలిపింది.
Read Also : మమ్ముట్టి ‘మామాంగం’ – టీజర్!
సుధాన్షు పాండే, షామా సికిందర్, మనీషా చౌదరి, రజిత్ కపూర్, గుల్ పనాగ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : రోహన్ గోఖలే, షరీబ్ తోషీ, కెమెరా : ఫసహత్ ఖాన్, ఎడిటింగ్ : బంటీ నాగి, వినయ్ పాల్, నిర్మాణం : మిరాజ్ ఫిలిం క్రియేషన్స్, NNM ఫిలింస్.