ఇంటర్ నెట్ షేక్ చేస్తున్న ప్రభాస్…ప్రకటనపై ఉత్కంఠ

  • Published By: madhu ,Published On : August 18, 2020 / 06:57 AM IST
ఇంటర్ నెట్ షేక్ చేస్తున్న ప్రభాస్…ప్రకటనపై ఉత్కంఠ

Updated On : August 18, 2020 / 10:29 AM IST

టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నారు. ఈ నటుడు ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై అతని అభిమానులతో పాటు ఇతరులు ఎదురు చూస్తున్నారు. 2020, ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 7.11 గంటలకు ఓ ప్రకటన చేస్తానని ప్రకటించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.



భారీ ప్రకటనకు సంబంధించి వివరాలు తెలియచేయనున్నారు. ఎంటా విషయం అనే దానిపై ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. సాహో ఫిల్మ్ తర్వాత…‘రాధే శ్యామ్’ పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. ఈ సినిమా అనంతరం వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించబోతున్నారు. కానీ..వీటన్నింటికీ మించి..భారీ ప్రకటన ఏదో చేయబోతున్నరనే టాక్ వినిపిస్తోంది.



విడుదల చేసిన వీడియోలో దర్శకుడు ఓం రౌత్, ప్రభాస్ ఉన్నారు. బాలీవుడ్ సినిమాలో ప్రభాస్ నటిస్తారని టాక్ వినిపిస్తోంది. హృతిక్ రోషన్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందని సమాచారం. 2022లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరి ఎలాంట ప్రకటన చేయబోతున్నారనేది కాసేపట్లో తెలియనుంది.