బుల్లితెర ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్ : పాపులర్ ప్రోగ్రామ్స్‌కు బ్రేక్..

కరోనా ఎఫెక్ట్ : బుల్లితెర కామెడీ షోలు, సీరియళ్ల ప్రసారాలు ఆగిపోనున్నాయా?..

  • Published By: sekhar ,Published On : March 21, 2020 / 12:42 PM IST
బుల్లితెర ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్ : పాపులర్ ప్రోగ్రామ్స్‌కు బ్రేక్..

Updated On : March 21, 2020 / 12:42 PM IST

కరోనా ఎఫెక్ట్ : బుల్లితెర కామెడీ షోలు, సీరియళ్ల ప్రసారాలు ఆగిపోనున్నాయా?..

కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమతో పాటు టెలివిజన్ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం (మార్చి-22) న జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. సినిమా, టీవీ సీరియల్స్ షూటింగులు బంద్ అయ్యాయి. తాజాగా తెలుగు పాపులర్ టీవీ షోల ప్రసారం నిలిచిపోనుందనే వార్తతో బుల్లితెర ప్రేక్షకులు షాక్‌కి గురవుతున్నారు.

తెలుగులో ‘జబర్ధస్త్’, ‘అదిరింది’, ‘పటాస్’, ‘పోవే పోరా’ వంటి షోలు బాగా క్లిక్ అయ్యాయి. టెలికాస్ట్ అయ్యేంది వారంలో ఒకటి, రెండు ఎపిసోడ్లే అయినా క్రేజ్ మాత్రం భారీ స్థాయిలో ఉంటుంది. చాలా కాలంగా ప్రసారం అవుతున్న జబర్ధస్త్‌కు పోటీగా ఇటీవల ‘అదిరింది’ అనే షో వచ్చిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా టీవీ సీరియల్స్, గేమ్ షోస్, వెబ్ సిరీస్ షూటింగ్స్ నిలిపివేయాలని తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ నెల 31 వరకు వీళ్లంతా షూటింగులకు దూరంగా ఉండనున్నట్టు తెలిపారు.

దాదాపు రెండు వారాల పాటు షూటింగ్ బంద్ కానున్న నేపథ్యంలో రెండు వారాలకు ఒకసారి షెడ్యూల్ జరుపుకునే ‘జబర్ధస్త్’, ‘అదిరింది’, ‘పటాస్’, ‘పోవే పోరా’తో పాటు మరికొన్ని షోలు ఆగిపోనున్నాయని సమాచారం. అయితే, ఇది ఒకటి రెండు ఎపిసోడ్స్‌కు మాత్రమే ఇబ్బందిగా మారుతుందన్న మాట కూడా వినిపిస్తోంది. ఎలాగూ ఎపిసోడ్స్ బ్యాకప్ ఉంటాయి కాబట్టి టీవీ సీరియళ్ల విషయంలో ఇది పెద్ద ఇబ్బందే కాదు కానీ కొత్తగా టెలికాస్ట్ అవుతున్న వాటికి మాత్రం కష్టాలు తప్పవని, లీడ్ యాక్టర్ల డేట్స్ తో ప్రాబ్లమ్ వస్తుందని అంటున్నారు.. ఈ పరిణామాలతో సీరియళ్ల ప్రసారాలు తాత్కాలికంగా ఆగిపోయే అవకాశం ఉంటుందేమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.