Chiranjeevi : మెగాస్టార్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు..
మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం పై తప్పుడు వార్తలు పోస్ట్ చేయడంతో ఓ యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదయింది. (Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్స్ తమ వ్యూస్ కోసం తప్పుడు వార్తలు, తప్పుడు థంబ్ నెయిల్స్ తో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. పలువురు సినిమా సెలబ్రిటీలపై కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గతంలో వదిలేసినా ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు సీరియస్ గా తీసుకుంటున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం పై తప్పుడు వార్తలు పోస్ట్ చేయడంతో ఓ యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదయింది. చిరంజీవి అనారోగ్యం పాలయ్యారు అని తప్పుడు వార్తలతో, చిరంజీవి మార్ఫింగ్ వీడియోలతో వీడియో పోస్ట్ చేసింది ఓ యూట్యూబ్ ఛానల్.
Also Read : Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంని కలవాలంటున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు.. లెటర్ వైరల్..
దీంతో న్యాయవాది రామకృష్ణ మిర్యాల ఈ వీడియోపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్ చిరంజీవి ఆరోగ్యానికి సంబంధించి అవాస్తవ, అభ్యంతరకర కంటెంట్‌ను రూపొందించి పోస్ట్ చేసారని, దాన్ని సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసారని, అభిమానులను ఆందోళనకు గురిచేశారని, వ్యూస్ కోసమే ఈ పనిచేసిందని వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రాథమిక పరిశీలన చేసి చిరంజీవి ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోలు పోస్ట్ చేసిన సదరు యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
